పొల్యూషన్ సర్టిఫికెట్ చూపిస్తేనే పెట్రోల్- అక్టోబర్ 25 నుంచి అమలు-ఎక్కడంటే...

భారత్ లో కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలుపెట్టి చిన్న చిన్న పట్టణాల్లో సైతం కాలుష్య భూతం ఆవరిస్తోంది. దీంతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోక తప్పని పరిస్ధితులు ఎదురవుతున్నాయి. దీంతో కాలుష్యం పరిమితులకు లోబడి ఉన్నట్లు ధృవపత్రం సమర్పిస్తేనే ఇకపై పెట్రోల్ పోసేలా నిబంధనల్ని సవరిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య ప్రభావం అంతకంతకూ పెరుగుతన్న నేపథ్యంలో అక్కడి ఆప్ ప్రభుత్వం అక్టోబర్ 25 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో కాలుష్య ధృవపత్రం (పొల్యూషన్ సర్టిఫికెట్ )ఉంటేనే పెట్రోల్ పోసేలా నిబంధనల్ని సవరించారు. కాలుష్య ధృవపత్రం లేకపోతే మాత్రం నిర్మొహమాటంగా పెట్రోల్, డీజిల్ నిరాకరించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తోంది. ఢిల్లీలో పెరుగుతున్నకాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వానికి ఇది తప్పనిసరిగా మారింది.

no fuel at delhi petrol bunks without pollution certificate from october 25

ఢిల్లీలో కాలుష్య ఉద్గారాలను నియంత్రించేందుకు ఆప్ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా శీతాకాలంలో కాలుష్య నియంత్రణ ప్రణాళిక అమలుచేస్తుంటారు. దీనికి తోడు ఈ ఏడాది శీతాకాలంలో అదనంగా పొల్యూషన్ సర్టిఫికెట్ నిబంధన అమల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మార్చి 3న దీనిపై ప్రజల నుంచి సూచనలను ఆహ్వానిస్తూ పబ్లిక్ నోటీసును ఇచ్చారు. దీనిపై సెప్టెంబర్ 29న రవాణా శాఖ, పర్యావరణ శాఖ, ట్రాఫిక్ పోలీసులతో సమావేశం జరిగిందని ఢిల్లీ రవాణా మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+