వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది జరిగే దాకా మేం ఇళ్లకు వెళ్లం -అగ్రి చట్టాలపై పోరు ఉధృతం -7దశ చర్చల్లో సర్కారు కాఠిన్యం

|
Google Oneindia TeluguNews

''రైతును ఆగం పట్టించే, కార్పోరేట్లకు మేలు చేసే వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేదాకా మేం మా ఇళ్లకు వెళ్లబోము. (జబ్ తక్ కానూన్ వాపసీ నహీ హోగా.. తబ్ తక్ హమారా ఘర్ వాపసీ నహీ). కేంద్రం తలొగ్గేదాకా ఇక్కడే, దేశరాజధాని ఢిల్లీ రోడ్లపైనే మా నిరనన కొనసాగిస్తాం'' అని కుండబద్దుకొట్టారు రైతు సంఘాల నేతలు.

Recommended Video

Kisan Parade : Farmers To Hold ‘Kisan Parade’ On Republic Day | Oneindia telugu

రామతీర్థం: జగన్ సర్కారు కీలక నిర్ణయం -విగ్రహ పున:ప్రతిష్ట -నెలలో ఆలయ ఆధునీకరణ -దర్యాప్తు సీఐడీకిరామతీర్థం: జగన్ సర్కారు కీలక నిర్ణయం -విగ్రహ పున:ప్రతిష్ట -నెలలో ఆలయ ఆధునీకరణ -దర్యాప్తు సీఐడీకి

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసన సోమవారంతో 40వ రోజుకు చేరింది. సమస్యల పరిష్కారం దిశగా రైతులకు, కేంద్రానికి మధ్య ఇప్పటికే జరిగిన ఆరు దశల చర్చలు విఫలం కాగా, సోమవారంనాటి ఏడో దశ చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. ఈనెల 8న ఇరు పక్షాలు మరోసారి మాట్లాడుకోవాలని నిర్ణయించాయి. చర్చల అనంతరం రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘No ghar wapasi’: Farmer leader vows to keep protesting till farm laws are repealed

విజ్ఞాన్ భవన్ లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ తదితులతో 40రైతు సంఘాల నేతలు జరిపిన చర్చలు ఫెయిలయ్యాయి. అనంతరం.. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్‌ తికాయిత్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తన చట్టాలను వెనక్కి తీసుకునేదాకా రైతులెవరూ ఇళ్లకు వెళ్లబోరని స్పష్టం చేశారు.

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయబోమని, అవసరం అనుకుంటే రైతులంతా సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చునని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ చెప్పారని కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ నేత సర్వాన్‌సింగ్‌ పందేర్‌ తెలిపారు. సోమవారం నాలుగు గంటల పాటు కేంద్ర మంత్రులతో ఏడోదఫా చర్చలు జరిగిన తర్వాత సర్వాన్‌సింగ్‌ పందేర్‌ మీడియాతో మాట్లాడారు.

రాతి బొమ్మలు పగిలితే ఇంత రచ్చా? తిరుమలలో రాయినే చూసొచ్చావా? -సీపీఐ నారాయణ vs బీజేపీ విష్ణురాతి బొమ్మలు పగిలితే ఇంత రచ్చా? తిరుమలలో రాయినే చూసొచ్చావా? -సీపీఐ నారాయణ vs బీజేపీ విష్ణు

7వ రౌండ్ చర్చల్లో.. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పనపై చర్చిద్దామని కేంద్ర మంత్రులు ప్రతిపాదించగా, అందుకు వీల్లేదన్న రైతు సంఘాలు.. తమ ప్రధాన డిమాండైన వ్యవసాయ చట్టాల రద్దుపైనే చర్చించాలని పట్టుపట్టారు. దీనిపై రెండు వర్గాలూ గట్టిగా పట్టు పట్టడంతో చర్చలు అసంపూర్తిగా, అర్ధాంతరంగా ముగిశాయి. ఈ నెల ఎనిమిదో తేదీన మరోదఫా చర్చలు జరిపేందుకు రైతు నేతలు అంగీకరించారు. తమ డిమాండ్లను ఆమోదించకుంటే..

రైతుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 6న ట్రాక్టర్ల ర్యాలీ, 13న సాగు చట్టాల ప్రతులను దహనం, జనవరి 23న నేతాజీ జయంతిని పురస్కరించుకుని ఆజాద్‌ హింద్‌ కిసాన్‌ దివస్‌, గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ట్రాక్టర్లతో గణతంత్ర పరేడ్‌, రైతు కవాతు నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు.

English summary
shortly after the seventh round of talks between the farmers and the government ended without a breakthrough, Bharatiya Kisan Union (BKU) spokesperson Rakesh Tikait said on Monday that until the three contentious farm laws were withdrawn, the protesters won’t go home. “Discussion took place on our demands -- repeal of the three laws and MSP... Kanoon wapasi nahi, to ghar wapasi nahi (We will not go home until the laws are withdrawn),” he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X