సీబీఐ అంటే సినిమాలాగే ఉండాలె -ఉద్యోగులెవరూ జీన్స్, టీషర్ట్, స్పోర్ట్స్ షూ వేయొద్దు: కొత్త డైరెక్టర్ సుబోధ్ ఆదే
నాటి సెవెంటీస్ మొన్నటి స్పెషల్ ఛబ్బీస్ వరకు సినిమాల్లో సీబీఐ అధికారి క్యారెక్టర్ అంటే.. ఫార్మల్ దుస్తుల్లో నీట్ గా టక్ చేసుకుని హుందాగా కనిపిస్తుంటారు. మోస్ట్ పాపులర్ టీవీ షో 'సీబీఐ'లో అధికారులు ఆల్మోస్ట్ సూట్లలోనే కనిపిస్తారు. నిజజీవితంలో మాత్రం సీబీఐ అధికారులు, ఉద్యోగులు చాలా మారిపోయారు. కంఫర్ట్ కోసం రకరకాల దుస్తులు ధరిస్తూ, ఆహార్యం ఇలానే ఉండాలనే గీతను ఎప్పుడో చేరిపేశారు. సీబీఐ కొత్త డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ మళ్లీ ఆ గీతను దిట్టం చేయనున్నారు. సీబీఐలో డ్రెస్ కోడ్ అమలుకు ఆయన కీలక ఆదేశాలిచ్చారు..
భారత దేశానికి సంబంధించి అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు చేపట్టి పట్టుమని 10 రోజులైనా తిరక్కముందే, సంస్థాగత ప్రక్షాళకు నడుంబిగించారు. ముందుగా ఉద్యోగుల క్రమశిక్షణపై ఫోకస్ పెట్టారు. సీబీఐలో పనిచేసే ప్రతి ఒక్కరూ విధిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించారు. ఇక నుంచి సిబ్బంది ఎవరూ జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడదని, హుందాగా కనిపించే ఫార్మల్ డ్రెస్సులే వేసుకోవాలని స్పష్టం చేశారు.

సీబీఐ కొత్త డైరెక్టర్ శుక్రవారం జారీ చేసిన ఆదేశల ప్రకారం.. సీబీఐలో పని చేసే పురుషులు షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్లు, ఫార్మల్ షూస్ వేసుకోవాలి. గడ్డం, మీసాలు పెంచడానికి వీల్లేదు. ప్రతి రోజూ నీట్‌గా షేవ్ చేసుకోవాల్సిందే. ఇక మహిళా అధికారులైతే చీరలు, సూట్లు, ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్లు మాత్రమే వేసుకోవాలి. మహిళలకు కూడా ఆఫీస్‌లో జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూస్, చెప్పులు, క్యాజువల్ వేర్ ఏదీ అనుమతించబోమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల హెడ్స్ కార్యాలాయాల్లోనూ ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని డైరెక్టర్ సుబోధ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. నిజానికి సీబీఐ సిబ్బందికి డ్రస్ కోట్ అనేది ఎప్పటి నుంచో అమలులో ఉందని, అయితే, గత కొన్నేళ్లుగా కొందరు క్యాజువల్స్ వేసుకుంటూ వచ్చారని, ఇన్ని రోజులూ వారిని ఎవరూ ప్రశ్నించకపోవడంతో అదలా కొనసాగిందని, డ్రెస్ కోడ్ విషయంలో కొత్త డైరెక్టర్ స్ట్రిక్ట్ ఆదేశాలు జారీచేయడంతో ఇక సీబీఐ అంటే సినిమాల్లో చూపించినంత ప్రొఫెషనల్ గానే కనిపిస్తారని తెలుస్తోంది. ప్రధాని మోదీ ఎంపికను సీజేఐ రమణ వీటో చేయడంతో, సీబీఐ డైక్టర్ అయిన సుబోధ్ కుమార్ గత వారమే సీబీఐ 33వ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications