లాక్‌డౌన్ లేదంటే భారీ మూల్యమే: 80 జిల్లాల్లో కొత్త కేసుల్లేవు, 10 లక్షల మందిపై నిఘా

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,077కి చేరాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటి వరకు 20.57 శాతం మంది అంటే 4,748 మంది కోలుకున్నారని చెప్పారు.

80 జిల్లాల్లో కసుల్లేవ్.. వారిపై నిఘా..

80 జిల్లాల్లో కసుల్లేవ్.. వారిపై నిఘా..

కాగా, గడిచిన 14 రోజుల్లో 80 జిల్లాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని లవ్ అగర్వాల్ తెలిపారు. 28 రోజులుగా 15 జిల్లాల్లో ఒక్క కేసు కూడా రాలేదని చెప్పారు. కరోనా పోరాటానికి నిఘా ప్రాథమిక ఆయుధమని నేషనల్ సెంటర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం 9.45 లక్షల మంది ప్రస్తతం నిఘా పరిధిలో ఉన్నారని తెలియజేశారు.

లాక్‌డౌన్ విధించకుంటే భారీ మూల్యమే..

లాక్‌డౌన్ విధించకుంటే భారీ మూల్యమే..

కరోనావైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. కరోనా కేసులు రెట్టింపు అవుతున్న సమయం భారీగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం 10 రోజులకోసారి కేసులు రెట్టింపు అవుతున్నాయన్నారు. లాక్ డౌన్ విధించడం వల్లే ఇవాళ కేసుల సంఖ్య 23వేలు దగ్గర ఉందని, లేదంటే ఆ సంఖ్య ఈ పాటికే 73వేలు దాటేదని నీతి ఆయోగ్ సభ్యుడు, ఎంపవర్డ్ గ్రూప్-41 ఛైర్మన్ డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు.

Recommended Video

    Coronavirus Update : COVID-19 Cases Crossed 23,000 Mark In India
    ఆ ఐదు నగరాలకు కేంద్ర బృందాలు

    ఆ ఐదు నగరాలకు కేంద్ర బృందాలు


    కాగా, లాక్‌డౌన్ మార్గదర్శకాలు అమలవుతున్న విధానం, సామాజిక దూరం అమలు, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, నిత్యావసర సరఫరా, వైద్య సిబ్బందికి భద్రత, సహాయ శిబిరాల్లో పరిస్థితిపై సమీక్షించిన కేంద్రానికి నివేదికలు అందించేందుకు మరో ఐదు అంతర్ మంత్రిత్వ శాఖల బృందాలను ఏర్పాటు చేసినట్లు హోంశాఖ సంయుక్త కార్యదర్శి సలిల శ్రీవాస్తవ తెలిపారు. అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, థానే, చెన్నై నగరాలకు ఈ బృందాలను పంపనున్నట్లు వెల్లడించారు. నాలుగు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న ఈ ఐదు నగరాల్లో ఇప్పటికే కేసుల తీవ్రత ఎక్కువ ఉన్నాయి. కాగా, ప్రస్తుతం దేశంలో 23,519 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 742 మంది మరణించారు. ప్రస్తుతం 17,555 యాక్టివ్ కేసులుండగా, 5,222 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+