Omicron:దేశంలో ఒక్క కేసు కూడా లేదు.. రాజ్యసభలో మాండవీయ ప్రకటన..

ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ భయాందోళన కలిగిస్తోంది. ఇదీ డెల్టా వేరియంట్ కన్నా ప్రమాదం అవడంతో.. అన్నీ దేశాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వైరస్ సౌతాఫ్రికాలో వెలుగుచూడగా.. చాలా దేశాలు ఆ దేశంతో రాకపోకలు నిషేధం విధించాయి. సౌతాఫ్రికా నుంచి బెంగళూరు, ముంబై, చండీగడ్‌కు ఒకరు, ఇద్దరు చొప్పున వచ్చారు. వారికి, ఆ కుటుంబంలో ఒకరు, ఇద్దరికీ కరోనా వైరస్ వచ్చింది. కానీ అదీ ఒమిక్రాన్ కాదా అనే అంశం తేల్చేందుకు పరీక్ష చేస్తున్నారు. ముంబై, హైదరాబాద్, బెంగళూరులో కాస్త హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.

ఒక్క కేసు కూడా లేదు..

ఒక్క కేసు కూడా లేదు..

దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వైరస్ కేసు నమోదు కాలేదని పెద్దల సభకు తెలిపారు. కొశ్చన్ అవర్‌లో ఆయన సభకు సమాధానం ఇచ్చారు. గత వారం వైరస్ వెలుగుచూడగా.. హై రిస్క్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ధృవీకరించింది. 14 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిందని మాండవియ రాజ్యసభలో తెలియజేశారు. కానీ దేశంలో ఆ వైరస్ జాడలేదని పేర్కొన్నారు. వైరస్ నివారణ కోసం అన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

శాంపిల్స్ పరీక్ష

శాంపిల్స్ పరీక్ష

సౌతాఫ్రికా నుంచి వచ్చిన వారిని శాంపిల్స్ పరీక్షిస్తున్నామని.. ఖచ్చితత్వంతో పరీక్ష చేస్తున్నామని వివరించారు. దేశంలో కరోనా కేసులు నియంత్రణలోనే ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు 124 కోట్ల వ్యాక్సిన్ అందజేశామని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. లక్షణాలు కనిపిస్తే వెంటనే జినొమ్ టెస్టు కోసం పంపించాలని కోరింది.

క్లోజ్‌లీ మానిటర్

క్లోజ్‌లీ మానిటర్


దేశంలో పరిస్థితిని నిశీతంగా గమనిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించడంపై ఆలోచిస్తున్నామని వివరించారు. దేశానికి ముప్పు ఉన్న కంట్రీస్ నుంచి వచ్చేవారి ప్రయాణంపై వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు కూడా జారీచేసింది. దేశానికి వచ్చే 72 గంటల ముందు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కూడా నిర్వహించాలని కోరింది. ఇటు ఒమిక్రాన్ బారిన పడ్డ దేశాలకు సాయం అందజేయడానికి విదేశాంగ శాఖ ముందుకొచ్చింది. తమ దేశంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ అందజేస్తామని ప్రకటనలో తెలిపింది. మెడికల్ కిట్స్, డ్రగ్స్ అందజేస్తామని వివరించింది.

మ్యూటెంట్లు..

మ్యూటెంట్లు..

మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ వివిధ మ్యూటెంట్లను పరివర్తనం చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదివరకు ఇలాంటి కాంబినేషన్ చూడలేమని వారు వివరించారు. ప్రొటీన్‌కు సంబంధించి 30 మ్యూటెషన్స్ ఉన్నాయి. కొత్త వేరియంట్‌ను బీటాతో పోల్చలేమని వివరించారు. ఇమ్యూనిటీ ఉన్నవారు.. వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ బరి నుంచి తప్పించుకోవచ్చు అని తెలిపారు. దీనికి సంబంధించి రెండు విధాలుగా స్టడీ చేశామన్నారు. ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ కొత్త వేరియంట్‌ను ఎదుర్కొగలవా అని ప్రశ్నిస్తే.. కచ్చితంగా తెలియదు అని సైంటిస్ట్ తెలిపారు. కానీ పౌష్టికాహారం తీసుకొని.. జాగ్రత్తగా ఉండాలని సజెస్ట్ చేశారు.

డెల్టా కన్నా డేంజర్

డెల్టా కన్నా డేంజర్

కొత్త వేరియంట్‌ను ఒమ్రికాన్ అని పిలుస్తున్నారు. 50 ఉత్పరివర్తనాలు, స్పైక్ ప్రొటీన్‌లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి. ఇంకొంచెం లోతుగా చూస్తే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి. మన శరీరంలోని కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+