వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింహాల చిహ్నాం వివాదం: సింహాలు దూకుడు స్వభావంతో.. అదేం లేదు: శిల్పి

|
Google Oneindia TeluguNews

కొత్త పార్లమెంట్ భవనం వద్ద ఏర్పాటు చేసిన నాలుగు సింహాల చిహ్నాంపై దుమారం చెలరేగింది. సింహాలు కోపంతో ఉన్నాయని విపక్షాలు ఆరోపించాయి. దీంతో ఏకంగా శిల్పి స్పందించారు. తనను ఎవరూ ప్రభావితం చేయలేరని శిల్పి సునీల్ దియోదర్ తెలిపారు. కొత్త చిహ్నాం ఏర్పాటు చేసేందుకు సారనాథ్‌లో గల చిహ్నాన్ని పరిశీలించామని తెలిపారు.

ఎత్తు తక్కువ..

ఎత్తు తక్కువ..


చిహ్నాం సేమ్ వచ్చేందుకు కృషి చేశామని తెలిపారు. ఒరిజినల్ చిహ్నాం ఎత్తు కేవలం 3 నుంచి 3.5 ఫీట్లు ఉందని.. కానీ పార్లమెంట్ వద్ద ఏర్పాటు చేసిన చిహ్నాం 21.3 ఫీట్ల ఎత్తు ఉందని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వస్తోన్న ఫోటోలు.. కింది నుంచి తీశారని.. అందుకే వ్యక్తికరణలో తేడా కనిపించిందని వివరించారు. అంతేకాదు తనకు కాంట్రాక్టు ప్రభుత్వం నుంచి డైరెక్టుగా రాలేదని తెలిపారు. తనకు టాటా ప్రాజెక్టు లిమిటెడ్ పని అప్పగించిందని వివరించారు. చిహ్నాం రూపొందించేందుకు 9 నెలల సమయం పట్టిందని తెలిపారు.

అవమానం..

అవమానం..


నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన నాలుగు సింహాల జాతీయ చిహ్నం అవమానకరంగా ఉందని టీఎంసీ ఎంపీలు జవహర్ సర్కార్, మహువా మొయిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సారనాథ్‌లోని అశోకుని నాలుగు సింహాలతో పొంతన లేకుండా, దూకుడు స్వభావాన్ని ప్రదర్శించే సింహాలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. సారనాథ్‌లోని అశోకుని లయన్ కేపిటల్‌ను ఆదర్శంగా తీసుకుని జాతీయ చిహ్నాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. వృత్తాకార పీఠంపైన దీనిని నిర్మించారు. దీని దిగువ భాగంలో ధర్మ చక్రం, ఎద్దు, గుఱ్ఱం కూడా ఉన్నాయి.

మట్టితో తయారు చేసి.

మట్టితో తయారు చేసి.


మట్టితో ఓ నమూనాను తయారు చేసి, ఆ తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను రూపొందించారు. దీనిని కంచుతో తయారు చేశారు. దీని బరువు 9,500 కిలోగ్రాములు, ఎత్తు 6.5 మీటర్లు. 6,500 కిలోగ్రాముల బరువైన ఉక్కు నిర్మాణంపై దీనిని ఏర్పాటు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన తర్వాత ప్రధాని మోదీ దీనిని ఆవిష్కరించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా 13 ఎకరాల విస్తీర్ణంలో, నాలుగు అంతస్థుల పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం అక్టోబరునాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాలను నూతన భవనంలోనే జరుపుకునే అవకాశం ఉంది.

 పొంతనలేదు..

పొంతనలేదు..

టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ ట్వీట్‌ చేశారు. అద్భుతమైన హుందాతనం నిండిన అశోకుని సింహాలతో కూడిన మన జాతీయ చిహ్నానికి అవమానం జరిగిందన్నారు. అసలు చిహ్నంలోని సింహాలు ఎంతో నాజూకుగా, రాజసంతో కూడిన ఆత్మవిశ్వాసంతో ఉంటాయన్నారు. నూతన పార్లమెంటు భవనంపై ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని సింహాలు మోడీ తరహాలో ఉన్నాయన్నారు. ఇవి కోపంతో గుర్రు పెడుతున్నట్లు, అనవసరమైన దూకుడును ప్రదర్శిస్తూ, పొంతన లేకుండా ఉన్నాయని మండిపడ్డారు.

English summary
national emblem by installing aggressive and disproportionate likeness of Lion Capital of Ashoka atop the new Parliament building in Delhi sculptor Sunil Deore, said no one influenced its making.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X