విమాన ఛార్జీల పెంపుపై తేల్చి చెప్పిన ఇండిగో

విమాన ప్రయాణికులకు రాబోయే రోజుల్లోనూ టికెట్ ఛార్జీల భారం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించట్లేదు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు, విమానాశ్రయ నిర్వహణ వ్యయం రోజురోజుకూ పెరుగుతుండటంతో విమానయాన సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోన్నాయి. అంతర్జాతీయంగా తలెత్తుతున్న ఇంధన సరఫరా సమస్యలు, వివిధ దేశాలు విధించిన గగనతల ఆంక్షలు ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు గరిష్ఠ స్థాయిలో లేనప్పటికీ.. జెట్ ఫ్యూయల్ రిఫైనరీ ప్రక్రియలో తలెత్తిన లోపాల వల్ల విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా ముడిచమురు ధరలు, జెట్ ఫ్యూయల్‌కు మధ్య ఉండే వ్యత్యాసం క్రాక్ స్ప్రెడ్ 65 శాతానికి పైగా పెరగడం విమానయాన సంస్థలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఇదివరనకు 22 శాతమే.

యూరప్ సహా మధ్యప్రాచ్య దేశాల్లోని ప్రధాన రిఫైనరీలలో జెట్ ఫ్యూయల్ ఉత్పత్తి తగ్గడం ఈ తీవ్ర వ్యత్యాసానికి కారణమైంది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చులే దాదాపు 40 శాతం వరకు ఉంటాయి. అందువల్ల ఇంధన ధరల పెరుగుదల ఎయిర్‌లైన్స్ లాభాలను దెబ్బతీస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ పరిస్థితి సర్దుబాటు కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు.

No plans for fuel price hedging now will look option when expanding long haul ops says IndiGo CEO

ఈ పరిణామాలపై ఇండిగో సీఈఓ విల్లీ వాల్ష్ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరల హెడ్జింగ్ చేసుకునే ఆలోచన ఏదీ లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో సుదూర ప్రాంతాలకు అంతర్జాతీయ విమాన సేవలను మరింతగా విస్తరించే సమయంలో మాత్రమే దీన్ని పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.

నేటి నుంచే బుకింగ్స్ ఓపెన్: ఇండిగో విమానాల్లో నూతన ఛార్జీల విధానం: ఇకపై.. !!
నేటి నుంచే బుకింగ్స్ ఓపెన్: ఇండిగో విమానాల్లో నూతన ఛార్జీల విధానం: ఇకపై.. !!

ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయని, దీనికి తోడు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం కూడా ఎయిర్‌లైన్స్ పై ఆర్థిక భారాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు. ఈ ప్రతికూల అంశాల వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో నష్టాలను చవి చూడాల్సొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

బెంగళూరులో ఠారెత్తిస్తోన్న మెనూ.. పాల క్యాన్లతో రోడ్డెక్కిన కేంద్ర మంత్రి
బెంగళూరులో ఠారెత్తిస్తోన్న మెనూ.. పాల క్యాన్లతో రోడ్డెక్కిన కేంద్ర మంత్రి

క్రూడాయిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల నుంచి బయటపడటానికి, రిస్క్ మేనేజ్మెంట్ లో భాగంగానే హెడ్జింగ్ విధానాలను అనుసరిస్తామని వివరించారు. ప్రస్తుతం దేశీయ విమానయాన రంగానికి చెందిన ఏ ఒక్క ఎయిర్‌లైన్ కూడా ఫ్యూయల్ హెడ్జింగ్ విధానాన్ని పాటించట్లేదని విల్లీ వాల్ష్ గుర్తు చేశారు. దేశీయ మార్కెట్‌లోని పోటీదారులు ఎవరూ హెడ్జింగ్ చేయని సమయంలో తాము దీన్ని అమలు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+