ఒత్తిడి లేదని రాజ్, సునంద-థరూర్ ఫైట్‌పై ఫ్లైట్ సిబ్బంది నుండి ఆరా
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్యా కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ మాజీ భద్రతా అధికారి సహా పలువురిని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. సునంద మృతి చెందిన రోజున శశిథరూర్ కదలికలపై ఆరా తీస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో శశిథరూర్‌ను ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, సునంద హత్య కేసులో విచారణ అధికారులు, పోలీసుల పైన ఎలాంటి రాజకీయ ఒత్తిడులు కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉండగా, సునంద హత్య కేసును వీలైనంత త్వరగా ఛేదించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఢిల్లీ లీలా హోటల్‌లో సునంద మృతి హత్యేనని నిర్ధారణకు వచ్చిన తర్వాత దర్యాప్తు వేగవంతమైంది. లీలా హోటల్ మేనేజర్ నుంచి కూడా కొన్ని విషయాలు పోలీసులు సేకరించారు. శశిథరూర్ దంపతులు లీలా హోటల్‌లో బస చేసినప్పటినుంచి వారిని కలుసుకునేందుకు వచ్చిన సందర్శకుల జాబితాను పరిశీలిస్తున్నారు.
హటల్‌లో వేర్వేరు గదుల్లో ఉన్నవారి జాబితను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. కాగా, ఎయిర్ ఇండియాకు చెందిన సిబ్బందిని ఢిల్లీ బోలీసులు గురువారం నాడు ప్రశ్నించారు. ఏడాది క్రితం థరూర్, సునందలు పబ్లిగ్గానే పోట్లాడుకున్నారని, ఈ నేపథ్యంలో వారిని ప్రశ్నించారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications