వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్లపై సుప్రీం సీరియస్, ఫేక్ ఐతే అవార్డులొద్దు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో పోలీస్ ఎన్‌కౌంటర్ల పైన సుప్రీం కోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిపై సుప్రీం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఎన్‌కౌంటర్ కేసుల విచారణను సీఐడీ ద్వారా చేపట్టాలని ఆదేశించింది. ఎన్‌కౌంటర్ వివరాలను రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ విధానంలో నమోదు చేయాలని ఆదేశించింది.

ఎన్‌కౌంటర్ సమయంలో వినియోగించిన మందుగుండు సామగ్రిని పరీక్షలకు పంపించాలని తెలిపింది. ఎన్‌కౌంటర్లపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, న్యాయ విచారణకు ఆదేశించాలని ఆదేశించింది. ఫేక్ ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న వారికి ప్రమోషన్లు, అవార్డులు ఇవ్వవద్దని సూచించింది.

No promotion or award for cops involved in fake encounter: SC

ఎన్‌కౌంటర్ల పైన మెజిస్టేరియల్ విచారణ చేపట్టాలని తెలిపింది. ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసులు ఆయుధాలను సరెండర్ చేయాలని తెలిపింది. సీఐడీ లేదా స్వతంత్ర న్యాయవ్యవస్థతో విచారణ జరిపించాలని సూచించింది.

యూపీలో ప్రమాదం, 11 మంది మృతి

ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది మృతి చెందారు. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

English summary
The Supreme Court on Tuesday said the policemen accused of staging fake encounters should not be promoted or given a gallantry award.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X