ఓట్ల లెక్కింపు ముగిసిన మరుసటి రోజే..

Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. బెయిల్ గడువు నేటితో ముగియనుంది. ఆదివారం నాడు ఆయన సరెండర్ కావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించాలంటూ రోస్ అవెన్యూ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు అరవింద్ కేజ్రీవాల్. అనారోగ్య కారణాలను చూపారు. ఆరోగ్యం బాగుండట్లేదని, షుగర్‌తో బాధపడుతున్నట్లు ఈ మధ్యంతన పిటీషన్‌లో పేర్కొన్నారు.

No relief for Arvind Kejriwal in Delhi Court

మొత్తం రెండు పిటీషన్లను దాఖలు చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఒకటి- రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించినది. మరొకటి అనారోగ్య కారణాలతో కనీసం ఏడు రోజుల పాటు మధ్యంతర బెయిల్ గడువును పొడిగించలంటూ రెండో పిటీషన్ వేశారు వీటిపై రోస్ అవెన్యూ న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా వాదనలను విన్నారు.

ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు సాగించాల్సి ఉందని అన్నారు. ఇప్పటివరకు చేపట్టిన విచారణ సందర్భంగా ఆయన ఎలాంటి సమాచారాన్ని కూడా వెల్లడించలేదని, పైగా దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని అన్నారు.

ఈ వాదనలు నేటితో ముగిశాయి. రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పిిటీషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తన తీర్పును రిజర్వ్ చేశారు. జూన్ 5వ తేదీన వీటిపై తీర్పును వెలువడించనున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన ముగుస్తుంది. ఆ మరుసటి రోజే కేజ్రీవాల్ బెయిల్ భవితవ్యం ఏమిటనేది ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ధారిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+