కేజ్రివాల్, కవిత కస్టడీపై ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం..!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు తర్వాత తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తో పాటు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కస్టడీ విషయంంలో ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిద్దరూ బెయిల్ కు దరఖాస్తు చేసుకుంటున్నా ఊరట లభించడం లేదు. ఇలాంటి తరుణంలో వీరిద్దరినీ మరోసారి 14 రోజుల పాటు రిమాండ్ కు పంపుతూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ కోర్టు గతంలో విధించిన రిమాండ్ ముగియడంతో వీరిద్దరినీ ఇవాళ తిరిగి న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కస్టడీని మే 7 వరకూ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో మరో 14 రోజుల పాటు వీరిద్దరూ తీహార్ జైల్లోనే గడపాల్సిన పరిస్దితి. అయితే సుప్రీంకోర్టులో కేజ్రివాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఈడీ వివరణ కోరింది. దీనిపై ఈడీ వివరణ వచ్చాక సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

మరోవైపు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రివాల్ పాల్గొనేందుకు వీల్లేకుండా పోయింది. తీహార్ జైల్లో అనారోగ్యంతో బాధపడుతున్న కేజ్రివాల్ సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో కేజ్రివాల్ దూరం కావడంతో ఆ పార్టీ నేతలకు ఇబ్బందిగా మారింది. ఇవాళ ఢిల్లీ కోర్టు రిమాండ్ పొడిగింపుతో ఆయన ఇబ్బందులు మరింత పెరిగాయి.












Click it and Unblock the Notifications