Cyrus Mistry Death : సైరస్ మిస్త్రీ ప్రాణం తీసింది అవే.. షాకింగ్ రిపోర్ట్..
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ నిన్న ముంబై-అహ్మబాబాద్ హైవేపై జరిగిన ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీతో పాటు ఆయన స్నేహితుడు జహంగీర్ పండోలే కూడా చనిపోయారు. కారు డివైడర్ కు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, అందులోనూ సైరస్ మిస్త్రీ వంటి వీఐపీ ఉండటంతో ఈ ప్రమాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కారు ప్రమాదం, వీరి మృతిపై పోలీసులు ప్రాధమికంగా దర్యాప్తు చేసి వివరాలు ప్రకటించారు.

సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ నిన్న ముంబై-అహ్మదాబాద్ హైవేపై ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దిగ్గజ వ్యాపార వర్గాల్లో మంచి పేరున్న సైరస్ మిస్త్రీ ఇలా కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో బిజినెస్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ కారు ప్రమాదం వెనుక ఏం జరిగిందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. అలాగే ఈ ప్రమాదం వెనుక ఏం జరిగిందనే దానిపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. అంతకు ముందే పోలీసులు ప్రాధమికంగా దర్యాప్తు చేసి తాము గుర్తించిన విషయాల్ని వెల్లడించారు.

పోలీసుల ప్రాధమిక నివేదిక
సైరస్ మిస్త్రీ కారు డివైడర్ కు ఢీకొన్న ఘటనలో మిస్త్రీతో పాటు ఆయన స్నేహితుడు జహంగీర్ పండోలే మృతిచెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి తిరిగొస్తుండగా మధ్యలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల నివేదిక వెల్లడించింది. అలాగే ఈ కారులో సైరస్ మిస్త్రీతో పాటు జహంగీర్ పండోలే, ఆయన భార్య అనహిత పండోలే కూడా ప్రయాణించినట్లు పోలీసులు తేల్చారు. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే చనిపోగా.. అనహిత తీవ్ర గాయాల పాలయ్యారు. అనహిత ముంబైకి చెందిన గైనకాలజిస్టు.

సీట్ బెల్ట్, ఓవర్ స్పీడ్ కారణాలు
పోలీసులు అందించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం.. అతివేగం, రోడ్డను అంచనా వేయడంలో లోపమే కారు ప్రమాదానికి కారణమైనట్లు గుర్తించారు. మృతులిద్దరూ సీటు బెల్టులు ధరించలేదని పోలీసులు వెల్లడించారు. చరోటి చెక్‌పోస్ట్‌లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు.. ఈ విషయాలు గుర్తించారు. పాల్ఘర్ పోలీసులు కారు చెక్‌పోస్టును మధ్యాహ్నం 2.21 గంటలకు దాటిందని, ఆ తర్వాత 20 కిలోమీటర్లు వెళ్లాక ప్రమాదం జరిగిందని కూడా గుర్తించారు. ప్రయాణ సమయంలో కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని, అలాగే 20 కిలోమీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లో చేరుకుందని కూడా పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిందిలా..
సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు సూర్య నదిపై వంతెనపై మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రమాదానికి గురైనట్లు తేల్చారు. మిస్త్రీ, జహంగీర్ పండోలే వెనుక సీట్లలో ఉన్నారని, డారియస్ ముందు సీటులో అనాహిత, చక్రం వద్ద ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఓ మహిళ కారు నడుపుతూ ఎడమవైపు నుంచి మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
ప్రమాదం జరగ్గానే 10 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చిందని, గాయపడిన ఇద్దరు వ్యక్తులను కారు నుండి బయటకు తీసి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అయితే మిగిలిన ఇద్దరు చనిపోయారు.సైరస్ తలకు గాయమైందని, అంతర్గత రక్తస్రావం జరిగిందని వారు వెల్లడించారు. ప్రాథమిక దశలో ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంలా కనిపిస్తోందన్నారు. సమగ్ర విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు.












Click it and Unblock the Notifications