చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై చేరుకున్న శశికళ.. నేతల ఘన స్వాగతం..

బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చిన శశికళ నేరుగా తన బంధువు కృష్ణప్రియ నివాసానికి చేరుకున్నారు. ఆమెతో పాటు టీటీవీ దినకరన్, పలువురు బంధువులు కూడా ఉన్నారు. ఆమె మద్ధతుదారులు శశికళకు ఘన స్వాగతం పలికారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ శుక్రవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తన భర్త నటరాజన్‌ బాగోగులు చూసుకునేందుకు ఐదు రోజుల పెరోల్ పై ఆమె జైలు నుంచి విడుదలయ్యారు.

పదిహేను రోజుల పెరోల్‌ మంజూరు చేయాలంటూ చిన్నమ్మ విజ్ఞప్తి చేసుకోగా ఐదు రోజుల పెరోల్ మాత్రమే కోర్టు ఇచ్చింది. దీంతో శుక్రవారం ఆమె కర్ణాటక పరప్పణ అగ్రహార జైలు నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

sasikala

బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చిన శశికళ నేరుగా తన బంధువు కృష్ణప్రియ నివాసానికి చేరుకున్నారు. ఆమెతో పాటు టీటీవీ దినకరన్, పలువురు బంధువులు కూడా ఉన్నారు.
చిన్నమ్మ శశికళ రావడంతో కృష్ణప్రియ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

శశికళకు హారతి ఇచ్చి ఆమె మద్ధతుదారులు ఘన స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత తమిళనాడుకు రావడంతో శశికళను చూసేందుకు భారీగా మద్దతుదారులు తరలి వచ్చారు. శశికళ జిందాబాద్ అంటూ నినాదాలతో ఆమె మద్దతుదారులు హోరెత్తించారు.

లివర్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్‌, ఇతర ఇంటెన్సివ్‌ కేర్‌ థెరఫీలను వైద్యులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భర్తను చూసేందుకు అనుమతించాలని, పదిహేను రోజులపాటు తనకు పెరోల్‌ మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేసుకోగా జైలు శాఖకు నిరాకరించింది.

దీంతో ఆమె ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ వైఖరి ఏమిటని కోర్టు ప్రశ్నించింది. పెరోల్‌ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో శశికళకు ఐదు రోజుల పెరోల్ లభించింది. ఈ క్రమంలో ఆమె బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చారు.

ఐదు రోజుల పెరోల్‌లో ఆమె రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో తలదూర్చవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె కేవలం తన ఇల్లు లేదా భర్త ఆసుపత్రి దగ్గర మాత్రమే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
VK Sasikala left a Bengaluru prison today, nearly eight months after she was jailed for corruption, on five-day emergency parole to travel to Chennai and visit her husband in hospital. For the brief outing, Sasikala had to accept conditions; in Chennai, she has to live at the home of her sister-in-law Ilavarasi, who was also jailed with her. The 61-year-old also has been banned from any political activity or statements to the media.She has also been told that she can't have visitors either at home or in the hospital. Recently evicted as chief of Tamil Nadu's ruling AIADMK, Sasikala was denied parole earlier this week on account of "incomplete paperwork", say officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X