'నేనున్నంత వరకూ మహారాష్ట్రను ఎవరూ విడదీయలేరు'
న్యూఢిల్లీ: మహారాష్ట్రను విభజించి ముంబయిను వేరుచేయాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ తోసిపుచ్చారు. మహారాష్ట్రను విడదీసే శక్తి, ముంబైని మహారాష్ట్ర నుంచి వేరుచేసే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని ప్రధాని మోడీ అన్నారు.
మంగళవారం మోడీ మహారాష్ట్రలోని గిరిజిన ప్రాంతమైన ధూలే జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గోని ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు గత పదేళ్లుగా అవాస్తవాలను ప్రచారం చేస్తూనే ఉన్నారని, మళ్లీ కొత్త అబద్దాలను చెప్తున్నారని అన్నారు.

"పదేళ్ల నుంచి పత్తి, ఉల్లిపాయలపై కాంగ్రెస్ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రను విభజిస్తారని మరో అబద్దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ దేశంలో పుట్టిన వారెవరైనా శివాజీ పుట్టిన స్థలాన్ని విభజించాలనుకుంటారా?" అని ప్రశ్నించారు.
తాను ఢిల్లీలో అధికారంలో ఉన్నంతకాలం ప్రప్రంచంలోని ఏశక్తీ మహారాష్ట్రను వీడదీయలేదని ఈ సందర్భంగా చెబుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలు అక్టోబర్ 15న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవాలని కోరారు.
"రాజకీయ నాయకులు ఎన్నికల హామీలను మర్చిపోతారేమో కానీ నేను మర్చిపోను. నేను రాజకీయ నాయకుడిని కాదు. మీ సేవకుడిని" అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దాంతో మోడీ మద్దతుదారులు కరతాళ ధ్వనులతో ఎన్నికల ప్రచారం మారుమ్రోగి పోయింది.












Click it and Unblock the Notifications