విజయ మాల్యాకు ముంబై కోర్టు షాక్
విజయ మాల్యాకు షాక్ తగిలింది. ముంబై కోర్టు ఆయనకు సోమవారం నాడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనిని సీబీఐ యూకేకు బదలాయించనుంది.
న్యూఢిల్లీ: విజయ మాల్యాకు షాక్ తగిలింది. ముంబై కోర్టు ఆయనకు సోమవారం నాడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగనామం పెట్టి, మనీ లాండరింగుకు పాల్పడిన కేసులో కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.
ఈ వారెంటును సీబీఐ యూకేకు బదలాయించనుంది. బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి, ప్రస్తుతం అతను యూకేలో తలదాచుకుంటున్నాడు. మాల్యాను భారత్ పంపించాలని కోరుతూ నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద ఈ వారెంటును సీబీఐ యూకేకు పంపిస్తుంది.

ముంబైలోని పిఎంఎల్ఏ కోర్టులో మాల్యా ఈ ఏడాది జూలైలో హాజరు కావాల్సి ఉంది. కానీ కోర్టు ఆదేశాలను ఆయన బేఖాతరు చేశారు. మాల్యా కోర్టు ఎదుట హాజరుకాలేదు. మార్చిలో దేశం విడిచిపోయిన మాల్యా పైన పలు చెక్ బౌన్స్ కేసులు కూడా నమోదయ్యాయి. చెక్ బౌన్స్ కేసులోను ముంబై కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పుడు ముంబై స్పెషల్ కోర్టు ఝలక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications