వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్, అమెరికా మాత్రమే కాదు.. పోర్చుగల్, మారిషస్, సింగపూర్ సహా 8 దేశాల్లో అగ్రనేతలుగా ఉన్న భారత సంతతి నాయకులు వీళ్లే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రిషి సునక్, కమలా హ్యారిస్

భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ రిషి సునక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనిపై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీన్నొక చారిత్రక ఘటనగా అభివర్ణించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రిషి సునక్‌ను అభినందిస్తూ రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాల కోసం రాబోయే కాలంలో అతనితో కలిసి పనిచేస్తానని అన్నారు.

భారత సోషల్ మీడియాలో కూడా రిషి సునక్ సాధించిన ఈ ఘనత గురించి చాలా స్పందనలు వస్తున్నాయి.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఒక ట్వీట్ చేశారు. ''1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు విస్టన్ చర్చిల్ మాట్లాడుతూ భారత నాయకులకు తక్కువ సామర్థ్యం ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో భారతీయ మూలాలు ఉన్న ఒక వ్యక్తి బ్రిటన్‌కు ప్రధానమంత్రి కావడం చూస్తున్నాం. జీవితం అందమైనది'' అని ఆనంద్ మహీంద్ర ట్వీట్‌లో పేర్కొన్నారు.

https://twitter.com/anandmahindra/status/1584531882435219461

ఈ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాల్లో అగ్రనాయకులుగా కొనసాగుతోన్న భారతీయ సంతతికి చెందిన ఇతర నేతల గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు.

ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియాతో పాటు ఆఫ్రికా, ఆసియాకు చెందిన చాలా దేశాల్లో భారత సంతతి నేతలు కీలక పదవుల్లో ఉన్నారు.

బ్రిటన్‌తో పాటు మరో ఏడు దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న భారత మూలాలకు చెందిన నేతల గురించి తెలుసుకుందాం.

భారత ప్రధాని మోదీతో పోర్చుగల్ పీఎం ఆంటోనియో కోస్టా

పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా

యూరప్‌లోని భారత సంతతి నేతల్లో ఆంటోనియో కోస్టా ప్రముఖులు. ఆయన పోర్చుగల్ ప్రధానమంత్రి.

ఆంటోనియా తండ్రి ఓర్లాండో కోస్టా ఒక కవి. ఆయన వలసవాద వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 'షైన్ ఆప్ ఆంగర్' అనే ప్రముఖ పుస్తకాన్ని పోర్చుగల్ భాషలో రాశారు.

ఆయన తాత పేరు లూయిస్ అఫోన్సో మారియా డి కోస్టా. లూయిస్ గోవాలో ఉండేవారు. ఆంటోనియా కోస్టా, మొజాంబిక్‌లో జన్మించారు. అయితే, ఇప్పటికీ ఆయన బంధువులు గోవాలోని మార్గోవా సమీపంలోని రువా అబేద్ ఫారియా గ్రామంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు.

భారత గుర్తింపు గురించి ఆంటోనియో కోస్టా ఒకసారి మాట్లాడారు. ''నా ఒంటి రంగు నన్ను ఎప్పుడూ ఏదీ చేయకుండా ఆపలేదు. నేను నా చర్మం రంగును సాధారణంగానే పరిగణిస్తాను'' అని అన్నారు.

అంతేకాకుండా కోస్టా, భారత ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) కార్డుదారుల్లో ఒకరిగా ఉన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017లో ఆయనకు ఓసీఐ కార్డును అందజేశారు.

నదిలో దీపం వదులుతున్న ప్రవింద్ జగన్నాథ్

మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్

మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జగన్నాథ్ కూడా భారతీయ మూలాలు ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన భారత్‌లోని బిహార్‌తో అనుబంధాన్ని కలిగి ఉన్నారు.

మారిషస్‌లోని బలమైన రాజకీయ నాయకుల్లో ప్రవింద్ జగన్నాథ్ తండ్రి అనిరుధ్ జగన్నాథ్ కూడా ఒకరు. అనిరుధ్ జగన్నాథ్ మారిషస్‌కు అధ్యక్షుడిగా, ప్రధానిగా వ్యవహరించారు.

https://twitter.com/ANI/status/1232305792654594049

ప్రస్తుతం మారిషస్‌కు ప్రధానిగా ఉన్న ప్రవింద్ జగన్నాథ్ కొంతకాలం ముందు ఆయన తండ్రి అనిరుధ్ అస్థికలను గంగా నదిలో కలపడానికి వారణాసికి వచ్చారు. ఇదే కాకుండా పలు సందర్భాలను పురస్కరించుకొని ఆయన భారత్‌కు వస్తూనే ఉంటారు.

మారిషస్‌కు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న పృథ్వీరాజ్‌సింహ్ రూపన్‌ కూడా భారతీయ సంతతికి చెందినవారే.

సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకూబ్

సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకూబ్

సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకూబ్ పూర్వీకుల మూలాలు కూడా భారత్‌లోనే ఉన్నాయి. ఆమె తండ్రి భారతీయుడు. తల్లి మలయాళీ మూలాలకు చెందినవారు.

సింగపూర్‌లో మలయాళీ జనాభా దాదాపు 15 శాతం ఉంటుంది.

హలీమా యాకూబ్, సింగపూర్‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

అంతకంటే ముందు సింగపూర్ పార్లమెంట్ స్పీకర్‌గా హలీమా వ్యవహరించారు. సింగపూర్ పార్లమెంట్‌కు స్పీకర్ అయిన తొలి మహిళ కూడా ఆమే.

భార్యతో చంద్రికా ప్రసాద్ సంతోఖీ

సూరీనామ్ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోఖీ

చంద్రికా ప్రసాద్ సంతోఖీ, లాటిన్ అమెరికా దేశమైన సూరీనామ్ అధ్యక్షుడు. ఆయనకు కూడా భారత్‌తో అనుబంధం ఉంది.

ఇండో-సూరీనామీ హిందూ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయనను చాన్ సంతోఖీ అని పిలుస్తారు.

చంద్రికా ప్రసాద్ సంతోఖీ సంస్కృత భాషలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

గుయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ

గుయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ

కరీబియన్ దేశమైన గుయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ పూర్వీకులు కూడా భారత్‌కు చెందినవారే.

1980లో ఒక ఇండో-గుయానీస్ కుటుంబంలో ఇర్ఫాన్ జన్మించారు.

భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో వావెల్ రామకలావన్

సీషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామకలావన్

సీషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామకలావన్ కూడా భారత సంతతి నాయకుడే. ఆయన పూర్వీకులు బిహార్‌కు చెందినవారు. ఆయన తండ్రి కమ్మర పని చేసేవారు. తల్లి ఒక టీచర్.

https://twitter.com/ANI/status/1380129198619037700

2021లో నరేంద్ర మోదీ ఆయన గురించి మాట్లాడుతూ ఆయనను భారత పుత్రుడు అని అభివర్ణించారు. ''వావెల్ రామకలావన్ పూర్వీకులు బిహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందినవారు. ఈరోజు కేవలం ఆయన గ్రామస్థులే కాకుండా భారతదేశం మొత్తం ఆయన సాధించిన విజయాలను చూసి గర్విస్తుంది'' అని మోదీ అన్నారు.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్

అమెరికాలో కమలా హ్యారిస్ చరిత్ర

భారతీయ సంతతికి చెందిన అగ్రనేతల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా ఉన్నారు.

2021లో ఆమె 85 నిమిషాల పాటు అమెరికా అధ్యక్ష భాధ్యతలు కూడా నిర్వహించారు. దీంతో, అమెరికా చరిత్రలో అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు.

దానికంటే ముందు, ఆమె 250 ఏళ్ల అమెరికా ప్రజాస్వామ్యంలో తొలి మహిళా, తొలి నల్లజాతి, తొలి ఆసియా-అమెరికా మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు.

కమలా హ్యారిస్, భారత్‌తో తన అనుబంధం గురించి బహిరంగంగా ప్రస్తావిస్తారు.

2018లో ఆమె ఆత్మకథ 'ద ట్రుత్ వీ టోల్డ్' పుస్తకం ప్రచురితమైంది. ''ప్రజలు నా పేరును ఏదో విరామచిహ్నాన్ని పలికినట్లు పిలుస్తారు. 'కామా-లా' అని అంటుంటారు'' అని తన ఆత్మకథలో రాశారు.

కాలిఫోర్నియా సెనెటర్ అయిన కమలా హ్యారిస్ తన పేరు అర్థాన్ని ప్రజలకు వివరించారు. ''నా పేరుకు అర్థం 'తామర పువ్వు'. భారతీయ సంస్కృతిలో ఈ పువ్వుకు చాలా ప్రాముఖ్యత ఉంది. తామర మొక్క నీటి అడుగున ఉంటుంది. దాని పువ్వు నీటి ఉపరితలంపై పూస్తుంది. తామర మొక్క వేళ్లు నదితో గట్టిగా పెనవేసుకొని ఉంటాయి'' అని తన పేరు గురించి వివరించారు.

కమల తల్లి భారత్‌కు చెందిన వారు. తండ్రి జమైకాకు చెందినవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Not only Britain and America.. these are the leaders of Indian descent who are the top leaders of 8 countries including Portugal, Mauritius and Singapore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X