వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకలో ముదురుతున్న సంక్షోభం..రాజీనామా లేఖలను చింపేసిన ట్రబుల్ షూటర్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వ పరిస్థితి వెంటిలేటర్‌పై ఉంది. ఈ క్రమంలోనే ఈ సంక్షోభం నుంచి జాగ్రత్తగా డీల్ చేయాలని ఢిల్లీ నుంచి హైకమాండ్ ఆదేశాలు జారీచేసినప్పటికీ ఎక్కడా పరిస్థితి చక్కబడినట్లు కనిపించడం లేదు. ఇప్పటికే మాజీ సీఎం సిద్ధరామయ్య చేతులెత్తేశారు. తన వల్ల కావడం లేదంటూ హైకమాండ్‌కు తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కర్నాటక కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా ఉన్న డీకే శివకుమార్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు సమర్పించిన రాజీనామా లేఖలను చింపివేశారు.

రాజీనామా లేఖలను చింపివేయడం వివాదాస్పదంగా మారడంతో శివకుమార్ స్పందించారు. రాజీనామా లేఖలను తానెందుకు చింపకూడదో చెప్పాలని ఎదురుగా ప్రశ్నించారు. కావాలంటే తనమీద కేసు నమోదు చేసుకోవచ్చంటూ బాహాటంగానే వ్యాఖ్యానించారు శివకుమార్. జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అప్పటివరకు గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం డీకే శివకుమార్ స్పీకర్ కార్యాలయంలోని రాజీనామా లేఖలను చింపివేశారని ప్రధాన ప్రతిపక్షనేత యడ్యూరప్ప బయట పెట్టారు. ఈ చర్యను తాము ఖండిస్తున్నట్లు యడ్యూరప్ప తెలిపారు.

Recommended Video

గెలిచి 24 గంటలు కాలేదు..అప్పుడే ఎంపీ పదవికి రాజీనామానా..?
Nothing wrong in tearing resignation letters,says congress trouble shooter Shiva Kumar

ఇక రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా తమ రాజీనామాలకు కారణంగా కాకమ్మ కథలు చెబుతున్నారని మండిపడ్డారు. వారు చెప్పే కారణం అసలు కారణం కాదని అన్నారు. వారు తిరిగి తమ రాజీనామా లేఖలను వెనక్కు తీసుకుంటారని భావిస్తున్నట్లు శివకుమార్ తెలిపారు. తాజా సమాచారం ప్రకారం 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలను సమర్పించినట్లు తెలుస్తోంది. రాజీనామాలు ఆమోదం పొందితే 13 నెలలు కుమారస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడినట్లు అవుతుంది. దీంతో 224 సభ్యులు ఉన్న కర్నాటక అసెంబ్లీలో ప్రభుత్వంకు మద్దతు ఇస్తున్న వారి సంఖ్య 104కు పడిపోతుంది.

బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో స్వీప్ చేసినప్పటి నుంచే రాజీనామాల హైడ్రామా ఊపందుకుంది. అయితే ప్రభుత్వంపై సీఎం కుమారస్వామి పట్టుకోల్పోయారనే వ్యాఖ్యలు చేశారు జేడీఎస్ ఎమ్మెల్యే విశ్వనాథ్. అయితే తమ రాజీనామాల వెనుక బీజేపీ లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ లోటస్ ద్వారా బీజేపీ ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతుందనే వాదనను విశ్వనాథ్ కొట్టివేశారు. అందులో నిజం లేదని స్పష్టం చేశారు. అది కేవలం ఊహాజనితమైన వార్త మాత్రమే అని చెప్పారు.

English summary
Why should I not, said DK Shivakumar, Congress party's chief troubleshooter in Karnataka, when he was asked why he tore the resignation letters of some of the MLAs who have submitted their resignations to the Speaker. He also said that let the MLAs file a complaint against him for tearing their resignation letters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X