నవంబర్ లో పర్యటించేందుకు 5 బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే..

నవంబర్ లో పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు బెస్ట్ టైమ్ అని అంటారు. నవంబర్ లో సాధారణంగా వర్షాలు తగ్గుముఖం పట్టి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అలాగే నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పండగలు ఉంటాయి. ఈ క్రమంలో ఈ నెలలో దేశవ్యాప్తంగా అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు వెళ్లేందుకు అనువైన సమయంగా చెబుతారు. నవంబర్ కార్తికమాసంలో వారణాసిలో దీపోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి.

కార్తికమాసంలో వారణాసి ప్రాంతంలో దేవ దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటారు. కార్తిక పౌర్ణమి రోజున గంగా నది ఘాట్స్ అన్నీ లక్షలాది దీపాలతో కన్నుల పండుగలా ఉంటాయి. ఈ సమయంలో వారణాసి ప్రాతంలో దేవతలు భూమిపైకి వచ్చి దీపాలు వెలిగిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ గంగా హారతి కూడా చాలా ఫేమస్. ఇక కార్తికమాసంలో కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని భక్తులు భావిస్తుంటారు.

ఇక కేరళ తిరువనంతపురంలోని వర్కాలా బీచ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది కేరళలోనే అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతంగా పేరుగాంచింది. ఈ తీర ప్రాంతాన్ని పాపనాశం బీచ్ అని కూడా పిలుస్తారు. ఇక వర్కాలా ప్రాంతంలో కప్పిల్ బీచ్ కూడా చాలా ఫేమస్. వర్కాలా టూరిస్ట్ స్పాట్ కు ఇది దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఓ వైపు బ్యాక్ వాటర్స్.. మరోవైపు అరేబియా సముద్రం ఉంటాయి. ఇది టూరిస్టులకు మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడకు దగ్గరలోనే ఉన్న అంజెంగో కోట, లైట్ హౌజ్ కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి నవంబర్ నుంచి మార్చి వరకూ బెస్ట్ టైమ్ గా చెబుతారు.

November tourism Here are the 5 best tourist spots to visit in November complete details for you

మేఘాలయ లోని షిల్లాంగ్ ను స్కాట్ లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రసిద్ధమైన ఎలిఫెంట్ ఫాల్స్.. ఉమియం సరస్సు.. షిల్లాంగ్ లేక్ చాలా ఫేమస్ గా ఉన్నాయి. అలాగే ఇక్కడ చిరపుంజి ప్రాంతంలో నిత్యం వర్షం కురుస్తూ పర్యటకులను అబ్బురపరుస్తుంది. చిరపుంజిలోని నోకలికై వాటర్ ఫాల్స్ అలాగే మాస్ మాయి గుహలను చూసేందుకు ఏటా అధిక సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు.

మరోవైపు ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉన్న ఔలి టూరిస్ట్ ప్రాంతానికి ఈ మధ్య కాలంలో పర్యటకుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా ఈ టూరిస్ట్ ప్రాంతానికి నవంబర్ నుంచి మార్చి వరకు అధిక సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. ఔలి టూరిస్ట్ ప్రాంతం భారత్ లోనే ప్రసిద్ధి చెందిన స్కీయింగ్ డెస్టినేషన్ గా పిలుస్తుంటారు. ఈ ప్రాంతం సముద్రమట్టానికి దాదాపు 2,800 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి రోప్ వే లో ప్రయాణం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలాగే నందాదేవి వ్యూ పాయింట్ కూడా చాలా పాపులర్ అయింది. మరి మీరు కూడా ఈ టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించేందుకు ప్లాన్ చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+