కండక్టర్ ప్రవల్లిక మృతితో ఆర్టీసీ సంచలన నిర్ణయం!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులు, సిబ్బంది భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి ఘటన నేపథ్యంలో కదులుతున్న బస్సుల్లో డోర్లు తప్పనిసరిగా మూసి ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్టీసీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అన్ని డిప్యూటీ రీజినల్ మేనేజర్లకు సూచనలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్టోబర్ 25న జరిగిన విషాద ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన 24 ఏళ్ల కండక్టర్ గుండ్ల ప్రవళిక మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లెవెలుగు బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపంలో ప్రయాణికురాలు బానోత్ మౌనికతో టికెట్ విషయంలో వాగ్వాదం జరిగింది. రూ.100నోటుకు చిల్లర తిరిగి ఇచ్చే విషయంలోనూ వివాదం తలెత్తినట్లు సమాచారం.ఈ క్రమంలో కదులుతున్న బస్సు నుంచి ప్రవళికను బయటకు తోసేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

TGSRTC closed bus doors mandatory After Conductor Pravalika s Death TGSRTC Made this decision

దీంతో ఆమె తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రవళిక మృతి చెందారు. ఈ ఘటన ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులను షాక్ కు గురి చేసింది. దీంతో భద్రతా చర్యలు మరింత కఠినం చేయాలని డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఇప్పుడు TGSRTC ప్యాసింజర్ డోర్లు ఉన్న అన్ని బస్సుల్లో ప్రయాణ సమయంలో తలుపులు తప్పనిసరిగా మూసి ఉంచాలని స్పష్టం చేసింది.

డోర్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని, లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించింది. బస్సులు ప్రయాణంలో ఉన్నప్పుడు తలుపులు తెరిచి ఉంచకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. క్షేత్రస్థాయి అధికారులు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

కొడంగల్ వేదికగా మెగా రైతు మేళా.. టార్గెట్ అదే!
కొడంగల్ వేదికగా మెగా రైతు మేళా.. టార్గెట్ అదే!

బస్సు తలుపులు సరిగా పనిచేస్తున్నాయా, ప్రయాణ సమయంలో మూసి ఉన్నాయా అనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు.గతంలోనూ బస్సుల్లో డోర్స్ తెరిచి ఉంచడం వల్ల ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కఠిన నిబంధనలు అమలు చేయడం వల్ల ఇలాంటి విషాదాలు తగ్గే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+