మైక్రోసాఫ్ట్, గూగుల్ బాటలో మెటా..! ఉద్యోగులకు వీఆర్ఎస్..!

ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను ప్రవేశపెట్టి ఉద్యోగులను ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచిస్తున్నాయి. ఇందులో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల్ని సామూహికంగా లేఆఫ్ లు ఇచ్చి తొలగిస్తుండగా.. మరికొన్ని కంపెనీలు వారిని స్వచ్చందంగా వెళ్లిపోయే అవకాశం కల్పిస్తున్నాయి. ఇందుకు ప్రతిగా భారీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఉద్యోగులకు ఎలాగోలా బయటికి వెళ్లక తప్పని పరిస్ధితులు ఎదురవుతున్నాయి.

ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల్ని ఇలా స్వచ్చందంగా వైదొలిగించేందుకు వీలుగా ప్యాకేజీలు ప్రకటించగా.. ఇప్పుడు వీరి బాటలోనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మెటా (Meta) కూడా చేరిపోయింది. ఫేస్ బుక్, ఇన్ స్టా, మెసెంజర్ లను నడుపుతున్న మెటా .. ఇప్పుడు తమ ఉద్యోగుల్ని తప్పించేందుకు స్వచ్చంద పదవీ విరమణ పథకం అమల్లోకి తెస్తోంది. ముందుగా దీన్ని ఫ్రాన్స్ లో అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ లో మెటా ఇచ్చిన ఆఫర్ కు 100 మంది ఉద్యోగులు అంగీకరించినట్లు తెలుస్తోంది. మిగతా ఉద్యోగుల్ని కూడా తప్పించేందుకు కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఏఐ రేసులో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మెటా ఇప్పుడు ఉద్యోగుల్ని తగ్గించుకోవడం ద్వారా దానిపై ఖర్చుపెట్టే మొత్తాల్ని పెంచుకునేందుకు చూస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఇలా స్వచ్చంద పదవీ విరమణ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Meta Offers Voluntary Exit Packages to 100 Employees in France Follows Microsoft and Google

ఫ్రెంచ్ పత్రిక 'లా లెట్రే' నివేదిక ప్రకారం, మటా ఫ్రాన్స్‌లోని తన ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ అవకాశాలను (VEOs) అందిస్తోంది. ఫ్రాన్స్‌లో మెటాకు 300 మంది ఉద్యోగులు ఉండా.. ఈ ప్రణాళిక వల్ల సుమారు 100 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆ నివేదిక చెబుతోంది. అయితే, దీనివల్ల ప్రభావితమయ్యే వారి పదవుల వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మైక్రోసాఫ్ట్, గూగుల్‌లో ఉద్యోగులు వ్యక్తిగతంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా, మెటాలో మాత్రం సామూహిక ఒప్పంద తొలగింపు ప్రక్రియపై ఆధారపడి ఉందని సమాచారం. సామూహిక ఒప్పంద రద్దు ప్రక్రియ లేదా ఫ్రెంచ్‌లో ఆర్‌సిసి అనేది ఒక కార్మిక చట్ట యంత్రాంగం. ఇది ఒక కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను స్వచ్ఛందంగా తగ్గించుకోవడానికి ట్రేడ్ యూనియన్లతో చర్చలు జరపడానికి అనుమతిస్తుంది. ఈ పథకంలో భాగం కావాలనుకునే ఉద్యోగులు నవంబర్ 5వ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని నివేదిక పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+