వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూత్ కాంగ్రెస్ సమావేశంలో: నవ్వాడని నటుడి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

అలప్పుజ(కేరళ): కేరళ రాష్ట్రంలోని అలప్పుజ జిల్లాలో జరిగిన యువజన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకున్ని అవమానించే విధంగా అక్కడికి వచ్చిన ఓ సినీ నటుడు నవ్వాడనే ఆరోపణలపై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. శుక్రవారం అలప్పుజలో జరిగిన సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జాతీయ పార్టీకి సంబంధించిన సమావేశం కావడంతో వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గురించి సమావేశంలో ఓ కాంగ్రెస్ నాయకుడు ప్రసంగిస్తున్న సమయంలో నవ్వాడనే నెపంతో సినీ నటుడు అనూప్ చంద్రన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని సమావేశంలో పాల్గొన్న పలువురు చెబుతున్నారు. అయితే నటుడు మాత్రం సంఘటనకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Kerala Congress

ఇండియా విజన్ ఛానెల్‌తో నటుడు మాట్లాడుతూ.. తాను సమావేశాన్ని దగ్గర్నుంచి వీక్షించానని, అక్కడి ఓ ప్రేక్షకుడిగా మాత్రమే వెళ్లనాని తెలిపారు. ఆ సమావేశంలో ఓ నాయకుడు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామి చట్టం ప్రపంచంలోనే ఉత్తమమైన పథకమని చెప్పడంతో తనకు నవ్వొచ్చిందని, అయితే అది సహజమైన ప్రతిచర్య అని తెలిపారు. తన చర్యను నియంత్రించుకోలేకపోయానని తెలిపారు. ఎవర్నీ అవమానించాలనే ఉద్దేశంతో నవ్వలేదని ఆయన అన్నారు.

కాగా రంగంలోకి దిగిన వామపక్ష పార్టీలు అరెస్ట్ చేసిన సినీ నటుడు అనూప్ చంద్రన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని గ్రామీణులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో యూపిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామి చట్టం(పథకం) కేరళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబడుతోంది.

English summary
Police in India act very quickly in few instances - when the petitioner is a religious party, hurt by a twitter joke or a scene in a film, or when the petitioner is a national party or a politician.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X