భారత్‌లో తొలిసారి: అహ్మదాబాద్ పార్కులో ప్రత్యక్షమైన ‘మిస్టీరియస్ మోనోలిత్’
అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న మిస్టీరియస్ మోనోలిత్(ఏకశిల) భారతదేశంలో తొలిసారిగా దర్శనమిచ్చింది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని పబ్లిక్ పార్కులో అరడగులు పొడవున్న లోహంతో కూడిన ఏకశిల రాత్రి రాత్రే ప్రత్యక్షమైంది.
ఈ శిల భూమిలో పాతిపెట్టినట్లు ఉంది కానీ, ఎక్కడా మట్టిని తవ్విన ఆనవాళ్లు లేవు. ఈ ఘటనపై పార్కు తోటమాలి ఆశారామ్ స్పందిస్తూ.. ఆ ఏకశిల అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను క్రితం రోజు సాయంత్రం చూసినప్పుడు అసలు దాటి ఆనవాళ్లే లేవని, ఉదయం వచ్చి చూసేసరికి ప్రత్యక్షమైందని తెలిపాడు.

ఆ లోహ శిల త్రిభుజాకారంగా ఉండి, దానిపై ఏవో కొన్ని అంకెలు, గుర్తులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఏకశిల గురించి ప్రచారం జరగడంతో అనేక మంది ప్రజలు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటుండటం ఆ పార్కు సందడిగా మారింది.
కాగా, ఈ ఏకశిలలు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 30 నగరాల్లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇవి అంతుచిక్కని రహస్యంగానే మిగిలాయి. ఈ మోనోలిత్ అమెరికాలోని ఉటా ఎడారిలో తొలుత ప్రత్యక్షమైనట్లు గుర్తించబడింది.
ఆ తర్వాత రొమేనియా, ఫ్రాన్స్, పోలాండ్, యూకే, కొలంబియాలో కూడా ఇలాంటి అంతుచిక్కని ఏకశిల నిర్మాణాలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత ఈ మిస్టీరియస్ మోనోలిత్ దానికదే అదృశ్యమవడం గమనార్హం. అహ్మదాబాద్‌లో ప్రత్యక్షమైన ఈ నిర్మాణం ఎంతకాలం ఉంటుందో చూడాలి.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications