మోడీ మరో కొత్త ప్రతిపాదన- "ఒకే దేశం-ఒకే యూనిఫామ్"- పోలీసుల కోసం

భారత్ లో కొన్నేళ్లుగా ప్రజల్లో జాతీయవాద భావనను పెంచేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం ఒకే దేశం-ఒకే రేషన్, ఒకే దేశం-ఒకే ఎన్నికలు ఇలా పలు ప్రతిపాదనల్ని తెరపైకి తెస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ ప్రధాని మోడీ మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈసారి ఒకే దేశం-ఒకే యూనిఫామ్ ప్రతిపాదనను ఆయన చేశారు.

దేశంలోని పోలీసులకు ఒకే దేశం-ఒకే యూనిఫామ్ అమలు చేసేందుకు వీలుగా ఓ ప్రతిపాదనను ప్రధాని మోడీ తెరపైకి తెచ్చారు. అయితే ఇది ప్రతిపాదన మాత్రమేనని, దీన్ని అమలుచేయడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రాలు దీన్ని సూచన ప్రాయంగా ఆలోచించాలని మాత్రమే తాను కోరుతున్నట్లు మోడీ వెల్లడించారు. దీనిపై ఒక్కసారి ఆలోచించమని రాష్ట్రాల్ని కోరారు. ఇది ఐదు, 50, లేదా 100 సంవత్సరాలలో జరగవచ్చన్నారు. అయితే చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి'' అని ప్రధాని మోదీ రాష్ట్రాల్ని కోరారు.

now pm modi proposes one nation-one uniform for police, says not trying to impose

రాష్ట్ర హోం మంత్రుల చింతన్ శివిర్ లో ప్రసంగించిన ప్రధాని మోడీ... దేశవ్యాప్తంగా ఉన్న పోలీసుల గుర్తింపు ఒకేలా ఉండవచ్చని తాను భావిస్తున్నానని అన్నారు. నేరాలు, నేరస్థులను ఎదుర్కోవడానికి రాష్ట్రాల మధ్య మరింత సన్నిహిత సహకారం ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. దేశంలో ఏకరూప శాంతిభద్రతల విధానం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన సూచనను కూడా మోడీ సమర్థించారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది రాజ్యాంగ భావన మాత్రమే కాదని, రాష్ట్రాలు, కేంద్రం బాధ్యత కూడా అని ఆయన అన్నారు.

రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినప్పటికీ, అవి దేశ ఐక్యత, సమగ్రతతో సమానంగా ముడిపడి ఉన్నాయని ప్రధాని అన్నారు. ప్రతి రాష్ట్రం నేర్చుకోవాలని, పరస్పరం స్ఫూర్తి పొందాలని, అంతర్గత భద్రత కోసం కలిసి పనిచేయాలని మోడీ సలహా ఇచ్చారు. అంతర్గత భద్రత కోసం రాష్ట్రాలు కలిసి పనిచేయడం రాజ్యాంగ ఆదేశంతో పాటు దేశం పట్ల బాధ్యత కూడా అని మోడీ తెలిపారు. సమర్థత, మెరుగైన ఫలితాలు, సామాన్యులకు రక్షణ కల్పించేందుకు అన్ని ఏజెన్సీలతో పాటు కేంద్ర, రాష్ట్రాలు రెండూ పరస్పరం సహకరించుకోవాలని మోడీ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+