వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియోకు షాక్: రోజుకు 10 ఎంబీ ఉచిత డేటా, ఎంసెంట్ బ్రౌజర్ తో ఇలా..

రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడమే సంచలనం.ఉచితంగా వాయిస్ కాల్స్, డేటా అంటూ రిలయన్స్ జియో సంచలనానికి తెరతీసింది. రిలయన్స్ జియో సంచలనాలతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ లలో మార్పులు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడమే సంచలనం.ఉచితంగా వాయిస్ కాల్స్, డేటా అంటూ రిలయన్స్ జియో సంచలనానికి తెరతీసింది. రిలయన్స్ జియో సంచలనాలతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ లలో మార్పులు చేశాయి.అయితే రిలయన్స్ కు కూడ ఓ విదేశీ కంపెనీ చుక్కలు చూపించేందుకు రంగం సిద్దం చేసింది.ప్రతి రోజూ 10 ఎంబీ ఉచిత డేటాను అందిస్తానని ఆ కంపెనీ ప్రకటించింది.

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపించింది రిలయన్స్ జియో.అయితే రిలయన్స్ జియో ఏప్రిల్ నుండి కస్టమర్ల నుండి డబ్బులు వసూలు చేయనుంది. ఈ మేరకు తన టారిఫ్ ను కూడ ప్రకటించింది.

ఎయిర్ టెల్ తో పాటు ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ రేట్లను మార్పులు చేశాయి. ఉచిత సర్వీసులను కొన్ని టెలికం కంపెనీలు ముందుకు వచ్చాయి.

అయితే రిలయన్స్ కూడ చుక్కలు చూపే కంపెనీలు కూడ ఇప్పుడిప్పుడే రంగంలోకి వస్తున్నాయి.తాము కూడ ఉచితంగానే ప్రతి రోజూ 10 ఎంబీ డేటాను ఉచితంగానే ఇచ్చేందుకు రంగంలోకి వచ్చింది.

రిలయన్స్ జియో కు పోటీగా జన ఉచిత ఆఫర్

రిలయన్స్ జియో కు పోటీగా జన ఉచిత ఆఫర్

ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్ పేరుతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా మరో సంస్థ ముందుకు వచ్చింది. ఓ విదేశీ సంస్థ ఈ మేరకు ఉచిత ఆఫర్ ను ప్రకటించింది. అమెరికాలోని బోస్టన్ ఆధారిత మొబైల్ ప్రకటనల సంస్థ జన ఉచిత డేటా ఆఫర్ తో ముందుకు వచ్చింది.తమ ప్లాట్ ఫాంపై ప్రకటనల ఆదాయం పెరిగే కొద్దీ ఉచిత డేటా ఆఫర్ ను పెంచేందుకు సిద్దమని ఆ సంస్థ ప్రకటించింది.

ఆండ్రాయిడ్ మోడ్ ను ప్రారంభించిన జన

ఆండ్రాయిడ్ మోడ్ ను ప్రారంభించిన జన

రిలయన్స్ ఇన్పోకామ్ ఏప్రిల్ నుండి తమ కస్టమర్ల నుండి డబ్బులు వసూలు చేయనుంది. ఈ మేరకు తన టారిఫ్ రేట్లను కూడ ప్రకటించింది. ఇప్పటివరకు ఉచితంగా సేవలు పొందిన కస్టమర్లు ఏప్రిల్ నుండి బిల్లు పే చేయాల్సి ఉంటుంది.అయితే ఇదే సమయంలో జన కంపెనీ తన ఆండ్రాయిడ్ బ్రౌజర్ ను శుక్రవారం నాడు ప్రారంభించింది.ప్రపంచ వ్యాప్తంగా ఎంసెంట్ బ్రౌజర్ ను భారత్ సహ ఇతర అభివృద్ది చెందుతున్న మార్కెట్లలో శుక్రవారం నాడు ప్రారంభించింది.ఈ మేరకు ప్రతి రోజూ తమ కస్టమర్లకు ఉచితంగా 10 జీబీ డేటాను అందించనున్నట్టు చెప్పారు.

దేశీయ కంపెనీలతో జన ఒప్పందం

దేశీయ కంపెనీలతో జన ఒప్పందం

భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో లాంటి దేశీయ టెలికం కంపెనీలతో జన కంపెనీ ఒప్పందం చేసుకొనే అవకాశం ఉంది. బిలియన్ ప్రజలకు ఇంటర్నెట్ ఉచితంగా అందించే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని సిఈఓ నాఘన్ ఈగిల్ చెప్పారు. ఎంసెంట్ బ్రౌజర్ ను ఎంసెంట్ యాప్ స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు.

వినియోగదారులను ఆకట్టుకొనేందుకే

వినియోగదారులను ఆకట్టుకొనేందుకే

డేటా ఖర్చు అధికంగా ఉండడంతో వినియోగదారులు మోర్ సెలెక్టివ్ గా ఉన్నారు. తద్వారా మొబైల్ ప్రకటనకర్తలకు సవాల్ గా మారింది. అయితే ఎంసెంట్ ఎంట్రీ ద్వారా ఇది మొత్తం మారిపోయే అవకాశం ఉందని జన మేనేజర్ ఇ:టర్నెంట్ సహ వ్యవస్థాపకుడు జోనాథన్ డిసౌజా చెప్పారు.వినియోగదారులకు ఉచింతగా ఇంటర్నెట్ బ్రౌజింగ్ సదుపాయం అందించడంతో పాటు ప్రకటనకర్తలకు మంచి అవకాశాలను కల్పిస్తోందన్నారు.

గూగుల్ ప్లే స్టోర్ తరహలోనే ఎంసెంట్ బ్రౌజర్

గూగుల్ ప్లే స్టోర్ తరహలోనే ఎంసెంట్ బ్రౌజర్

గూగుల్ ప్లే స్టోర్ తరహలోనే ఎంసెంట్ బ్రౌజర్ ను ఎంసెంట్ యాప్ స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకొనే అవకాశం ఉంది. భారత్ లో 2014 లో దీన్ని ప్రారంభించినా ఈ యాప్ ప్రతి డరౌన్ లోడ్ పై ఉచిత డేటాను ఆఫర్ చేసి 30 మిలియన్ల యూజర్లను ఆకర్షించింది.

English summary
As Reliance Jio Infocomm ends its free offer and moves into a billing mode, Indians are being pampered with another, this time from Boston-based mobile advertising firm Jana. The company is readying to launch an Android browser — mCent Browser — that enables users to surf the web free-of-cost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X