కేంద్రం స్పందించకపోతే.. 'మా మూత్రం మేమే తాగుతాం': తమిళ రైతుల నిరసన
కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే.. తమ మూత్రం తామే తాగుతామంటూ రైతులు ఆందోళన చేశారు.
న్యూఢిల్లీ: కరువు నిధుల విడుదల కోసం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల వినూత్న నిరసన కొనసాగుతోంది. శనివారం నాడు యూరిన్ బాటిల్స్ తో రైతులు నిరసన తెలియజేయడం గమనార్హం. కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే.. తమ మూత్రం తామే తాగుతామని, తమ మలం తామే తింటామని రైతులు ఆందోళన చేశారు.
ఇంత తీవ్రంగా సమస్య పోరాడుతున్నా.. కేంద్రం నుంచి స్పందన లేదని, కనీసం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరువు నిధులతో పాటు కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మార్చి 14నుంచి ఢిల్లీలో వారి నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

కాగా, ఈ నిరసనలో భాగంగా గతంలో కపాలాలతోను, నగ్నంగాను, చనిపోయిన ఎలుకలు, పాములతోను రైతులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే రైతుల నిరసనపై స్పందించిన ప్రభుత్వం తమిళనాడుకు రూ.2వేల కోట్లు విడుదల చేసినా.. అవి తమకు సరిపోవని రైతులు వాదిస్తున్నారు. ఆ సహాయం సరిపోదని, మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications