యూపీలో కూడ ఎన్ఆర్‌సీ జాబితాను రూపోందిస్తాం : సీఎం యోగి అదిత్యానాథ్

అసోం ఎన్ఆర్‌సీ తరహాలో పౌరుల జాబితాను అమలు చేయాలని భావిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అధిత్యానాథ్ దాస్ ప్రకటించారు. దేశ రక్షణ దృష్ట్య యూపిలో కూడ పౌరుల జాబితాను రూపోందించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రధాని నరంద్రమోడితోపాటు హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చిస్తానని చెప్పారు.

యూపిలో ఎన్ఆర్‌సీ లెక్కింపు చేపట్టే యోచనలో సీఎం

యూపిలో ఎన్ఆర్‌సీ లెక్కింపు చేపట్టే యోచనలో సీఎం

ఇటివల అసోంలో చేపట్టిన ఎన్ఆర్‌సీ నివేదికతో ఓవైపు ఆ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడ పౌరుల జాబితాను రూపోందించాలని దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపి సైతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ సంధర్భంగా అసోంలో పౌరుల జాబితాను రూపోందించడం చాల సహోసోపేతమైన నిర్ణయమని ప్రకటించిన ఆయన రాష్ట్రంలో కూడ అవసరమైతే చేపడతామని అన్నారు. దీనికి సంబంధించి అసోంలో లెక్కింపు జరిగిన విధానంపై సమీక్ష జరిపుతామని తెలిపారు. దీంతో ఎలాంటీ పొరపాట్లు లేకుండా జరిపేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

హర్యాణలో కూడ రూపోందిస్తామంటున్న సీఎం

హర్యాణలో కూడ రూపోందిస్తామంటున్న సీఎం

మరోవైపు ఆదివారం హర్యాణ సీఎం మనోహార్ లాల్ ఖత్తర్ కూడ జాబితాపై సానుకూలంగా స్పందిస్తూ ఇలాంటీ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలోకి అక్రమ వలసలను తనిఖి చేయాడానికి జాబితా అవసరం అవుతుందని అయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే హర్యాణలో అస్సాం తరహాలో ఎన్ఆర్‌సీని అమలు చేస్తామని ప్రకటించారు. ఇక అస్సాంలో ఇటివల విడుదల చేసిన ఎన్ఆర్‌సీ జాబితాలో కొంత గందరగోళం నెలకోన్న పరిస్థితి తెలిసిందే రాష్ట్రంలో మొత్తం ప్రకటించిన ఫైనల్ జాబితాలో19 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. దీంతో ప్రజలతోపాటు పలు రాజకీయ పార్టీలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ముస్లింల నిర్మూలనకే అంటూ అనుమానాలు

ముస్లింల నిర్మూలనకే అంటూ అనుమానాలు

మొత్తం మీద అసోంలో పౌరుల జాబితా లెక్కించడంతో దాన్నే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ఫాలో చేయాలని అనుకోవడంతో దేశవ్యాప్తంగా పౌరుల లెక్కింపులు జరుగుతాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలోనే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఉన్న యూపీలో ఇది ప్రారంభం అయితే ,దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడ పౌరుల లెక్కింపు విధానాన్ని తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పౌరుల జాబితాను రూపోందించడం వెనుక ఓ మతానికి చెందిన వారిని నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతుందనే విమర్శలు ఎదుర్కోంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+