ఎన్నారైలు కోటిన్నర..! ఓట్లున్నాయి 70 వేలే.. 0.5 శాతమేనా?
Recommended Video

ఢిల్లీ : దేశం వీడి విదేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య అక్షరాలా కోటి ముప్పై లక్షలు. మరి అందులో ఓటర్లుగా నమోదు చేసుకున్నవారి సంఖ్య చూస్తే ఆశ్చర్యమే. ఇక లెక్కల్లో ఎక్కాలు చూస్తే మరింత కంగుతినాల్సిందే. ఎందుకంటే కోటి ముప్పై లక్షల మందిలో కనీసం ఒక్క శాతమైనా (1 లక్ష 30 వేలు) ఓటర్లుగా నమోదు కాలేదు. కేవలం 71 వేల మంది మాత్రమే ఓటర్లుగా రిజిస్టరయ్యారు. అంటే 0.5 శాతం అన్నమాట.

అందులో ఎంత?.. అంత తక్కువా..!
తాజా ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నారైలకు ఓటు హక్కు ఉన్నది 71వేల పైచిలుకు మాత్రమే. అందులో 92 శాతం మంది కేరళవాసులేనట. అంటే దాదాపు 66 వేల మంది వాళ్లే కావడం గమనార్హం. అయితే వాస్తవానికి ఓటు హక్కు కల్పించాలని ఎన్నారై సంస్థలు ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడి ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపలేదనే ఆరోపణలున్నాయి.

అప్పుడు 10వేలు.. ఇప్పుడు 70వేలు
2010లో చట్టంలో కొన్ని మార్పుల కారణంగా ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించడం మొదలుపెట్టారు. ఇతర దేశాల్లో నివసిస్తూ.. అక్కడ పౌరసత్వం తీసుకోని భారతీయులకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. దాదాపు ఈ ఎనిమిదేళ్లలో కూడా ఓటర్ల సంఖ్య అంతలా పెరగకపోవడం గమనార్హం. 2012 సంవత్సరం నుంచి ఎన్నికల సంఘం ఎన్నారై ఓటర్ల జాబితా ప్రచురిస్తోంది. 2010, 2011, 2012.. అలా ఆ మూడు సంవత్సరాల్లో కేవలం 10 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు.

28 రాష్ట్రాల్లో 5వేలు.. ఒక్క కేరళలో 66వేలు
2012 నాటికి ఎన్నారై ఓటర్లు 10 వేల మంది ఉంటే.. 2018 నాటికి 24,507 మంది నమోదయ్యారు. అంటే ఆరేళ్లల్లో కేవలం 14 వేల మంది మాత్రమే ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఇక 2019 తాజా జాబితా చూసినట్లయితే ఆ సంఖ్య దాదాపు మూడింతలైంది. ప్రస్తుతం 71 వేల 735 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అందులో కేరళ వాటా 92 శాతంతో 66 వేల 584 మంది ఓటర్లు రిజిస్టరయ్యారు. అంటే మిగిలిన 28 రాష్ట్రాల వాటా 5 వేల 151 మంది మాత్రమే కావడం గమనార్హం.
అటు ఎన్నికల సంఘం ఎన్నారై ఓటర్ల నమోదుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా ప్రయోజనం మాత్రం శూన్యం. నమోదు ప్రక్రియ కొంత క్లిష్టతరంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తద్వారా ఓటు నమోదు కోసం ఎన్నారైలు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే వాదనలున్నాయి. అదలావుంటే ఈ సంవత్సరం ఎన్నారై ఓటర్ల జాబితాలో 20 మంది హిజ్రాలు ఉండటం విశేషం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications