నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్రం మరో అడుగు, ఎన్నారైలు షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎన్నారైలకు షాక్ ఇచ్చింది. నల్లధన నిర్మూలనలో భాగంగా కేంద్రం మరో చర్య తీసుుకున్నది. విదేశాలలో ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు కలిగివున్న భారతీయులకు ఈ నిర్ణయం కాస్త ఇబ్బందికరంగా మారనుంది.

విదేశాలలో ఉంటున్న భారతీయులు తమ ఆదాయ ధృవీకరణ పత్రాల్లో.. విదేశాల్లో ఉన్న వారి బ్యాంకు అకౌంట్లు, ఆస్తిపాస్తుల వివరాలను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిబంధన ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. విదేశాల్లో ఉన్న ఆస్తులకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వివరాలను మాత్రం తప్పని సరిగా తెలియజేయాల్సి ఉంటుంది.

NRIs’ foreign bank accounts under income tax lens

తక్కువ కాలం పని చేయడానికి వెళ్లిన వలస జీవులతో సహా ఉద్యోగాలు చేసే ఎన్నారైలు కూడా ఈ మేరకు వివరాలను తెలిజేయాల్సి ఉంటుంది. నల్లధనాన్ని అరికట్టే చర్యలలో భాగంగా అక్రమ సొమ్ముని పసిగట్టేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎన్నారైలకు కేంద్రప్రభుత్వం తెలిపింది.

200 rupees notes shall soon enter the market | Oneindia News

అయితే ఈ నిబంధనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, విదేశాల్లో ఉంటూ నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఈ నిబంధన ఇబ్బందికరంగా మారనుందని డెలోయెట్టే హస్కిన్స్ అండ్ సేల్స్ పార్ట్‌నర్ నీరూ అహుజా అభిప్రాయపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
For decades, many Indians have escaped tax and legitimised their money stashed abroad by staying 182 days out of the country every year and declaring themselves as ‘non-resident’. The status of a non-resident Indian, or NRI, allowed them to claim such funds lying in offshore bank accounts as lawful income earned abroad. From now on, this won’t be easy. A few days ago, income-tax authorities have added a new provision in the tax return form (ITR2) which will require all non-residents to disclose details of their bank accounts outside India. Most NRIs, even those who have been away for years, file tax return in India to cover their income from stocks, properties and fixed income instruments like bank deposits and bonds.
Please Wait while comments are loading...