Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా విషాదం: వెంటిలేటర్, అంబులెన్స్ ఆలస్యంతో ఎన్ఎస్జీ కమాండో మృతి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అనేక మంది ప్రాణాలు తీస్తోంది. తాజాగా, ఓ నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్‌జీ) సీనియర్ కమాండో కరోనాతో గ్రేటర్ నోయిడాలోని చికిత్స పొందుతూ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్) ఆస్పత్రిలో బుధవారం ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఉన్నత స్థానంలో ఉన్న ఈ బలగాల్లో కరోనా కారణంగా నమోదైన తొలి మరణం ఇదే కావడం గమనార్హం.

ఏప్రిల్ 19న గ్రూప్ కమాండర్(కోఆర్డినేషన్) బీకే ఝా కరోనా బారినపడ్డారని ఎన్ఎస్జీ అధికార వర్గాలు తెలిపాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో సీపీఎఫ్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది.

NSG Commando dies of Covid-19, precious time lost in arranging ventilator, ambulance

వెంటనే బీకే ఝాకు వెంటిలేటర్ అమర్చాలని ఎన్ఎస్జీ అధికారులు ఆస్పత్రి వైద్య సిబ్బందిని కోరాయి. అయితే, ఆస్పత్రిలోని రెండు వెంటిలేటర్లు కూడా పనిచేయడం లేదని వారు తెలిపారు. దీంతో వెంటనే న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కు ఫోన్ చేశారు. అయితే, ఇంత తక్కువ సమయంలో తాము వెంటిలేటర్ సమకూర్చలేమని ఎయిమ్స్ సిబ్బంది స్పష్టం చేశారు.

ఆ తర్వాత నోయిడాలోని ఫోర్టిస్ ఆస్పత్రిని వెంటిలేటర్ కోసం సంప్రదించారు. అయితే, అన్ని వైద్య సదుపాయాలున్న అంబులెన్స్ లో మాత్రమే బీకే ఝాను ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటి అంబులెన్స్ సీఏపీఎఫ్ ఆస్పత్రిలో అందుబాటులో లేదు. చివరకు ఎన్ఎస్జీ తన అడ్వాన్స్‌డ్ కార్డియక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్(ఏసీఎల్ఎస్)లో ఆస్పత్రికి తీసుకొచ్చింది.

బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆస్పత్రికి వద్దకు అంబులెన్స్ చేరుకోగా.. బీకే ఝా 3 గంటలకు గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. వెంటిలేటర్స్ ఉన్నప్పటికీ వాటిని ఆస్పత్రి వర్గాలు ఎందుకు ఉపయోగించుకోవడం లేదో తెలియడం లేదని ఎన్ఎస్జీ వర్గాలు అసహనం వ్యక్తం చేశాయి. భద్రతా దళాలకు చెందిన సిబ్బందికి వైద్యం అందించే సీఏపీఎఫ్ ఆస్పత్రిలో సౌకర్యాల లేమిమై మండిపడ్డాయి.

బీకే ఝా మరణం పట్ల డీజీ అండ్ ఎన్ఎస్జీ ర్యాంకులకు సంబంధించిన అందరు అధికారులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఎన్ఎస్జీ ట్విట్టర్ వేదికగా ఆయనకు నివాళులర్పించింది.

Recommended Video

    హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు || Chandrababu Naidu Aproaches High Court Of AP For His Security

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+