వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నుపుర్ శర్మ ఎఫెక్ట్: తమ నేతల టీవీ డిబేట్లపై నిషేధించిన అఖిలేష్ యాదవ్ పార్టీ

|
Google Oneindia TeluguNews

లక్నో: బీజేపీ నుంచి సస్పెండైన నేత నూపుర్ శర్మ వివాదాస్ప వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎలాంటి టీవీ చర్చల్లో పాల్గొనకుండా తన మీడియా ప్యానలిస్ట్, అధికార ప్రతినిధులపై నిషేధం విధించింది అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ).

అంతేకాకుండా, ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయవద్దని పార్టీ నేతలను ఎస్పీ కోరింది.
కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హింస చెలరేగడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నేటి ఘటనలను సమీక్షించిన యూపీ సీఎం, ఈ సంఘ విద్రోహశక్తులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

 Nupur Sharma Controversy effect: Samajwadi Party Bans Party Leaders From TV Debates

మహ్మద్ ప్రవక్తపై ఇప్పుడు సస్పెండ్ చేయబడిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం అనేక రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగాయి.శుక్రవారం ప్రార్థనల అనంతరం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో నిరసనలు ప్రదర్శనలు జరిగాయి.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ముస్లింల నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. జార్ఖండ్ రాష్ట్రంలోనూ నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

English summary
Nupur Sharma Controversy effect: Samajwadi Party Bans Party Leaders From TV Debates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X