వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నుపుర్ శర్మను ఇస్లాం ప్రకారం క్షమించాలి: చట్టాన్ని చేతుల్లోకి వద్దంటూ జమాత్ ఉలేమా ఎ హింద్న్యూఢిల్లీ: ముహమ్మద్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ నాయకురాలు నుపుర్ శర్మను ఇస్లాం ప్రకారం క్షమించాలని జమాత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు సుహైబ్ ఖాస్మీ ఆదివారం అన్నారు.
ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్త నిరసనలతో ముస్లిం పండితుల సంస్థ విభేదిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు.. శుక్రవారం ప్రార్థనల అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలపై జమాత్ ఉలమా-ఎ-హింద్ సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఖాస్మీ మాట్లాడుతూ.. నూపుర్ శర్మను క్షమించాలని ఇస్లాం చెబుతోంది అని అన్నారు. నుపుర్ శర్మ, ఆమె అవమానకరమైన వ్యాఖ్యలపై శుక్రవారం ప్రార్థనల తర్వాత దేశవ్యాప్తంగా ప్రారంభమైన నిరసనతో తాము విభేదిస్తున్నామని చెప్పారు.

Nupur Sharma, who made controversial remarks against Prophet, should be forgiven as per Islam: Jamaat Ulama-e-Hind

అంతేగాక, నుపుర్ శర్మను సస్పెండ్ చేయాలనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్ణయాన్ని జమాత్ ఉలమా-ఎ-హింద్ అధ్యక్షుడు స్వాగతించారు. "భారతదేశ చట్టాలను అనుసరించి తీసుకున్న నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం సరికాదని ఖాస్మీ అన్నారు.

రోడ్డుపైకి వచ్చి పాలనను ఉల్లంఘించడాన్ని చట్టం అనుమతించదు" అని ఖాస్మీ మీడియా సమావేశంలో అన్నారు. జమాత్ ఉలమా-ఎ-హింద్ 'ఫత్వా' జారీ చేయాలని నిర్ణయించింది, దీని ద్వారా ఎలాంటి హింసకు మద్దతు ఇవ్వవద్దని ప్రజలను కోరుతుంది. నుపుర్ శర్మ, ఆమె వ్యాఖ్యలకు సంబంధించి "అసదుద్దీన్ ఒవైసీ, మహ్మద్ మదానీలకు వ్యతిరేకంగా ఫత్వా వస్తుంది అని జమాత్ పేర్కొంది.

జమాత్ ఉలమా-ఎ-హింద్.. అనేక ముస్లిం సంస్థలు, వాటికి నిధులు సమకూర్చడంపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. హింసను ప్రేరేపించడానికి ఇతర ముస్లిం సంస్థలను అనుమతించబోమని స్పష్టం చేసింది.

సస్పెండ్ చేయబడిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, బహిష్కరణకు గురైన నేత నవీన్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలో నిరసన హింసాత్మకంగా మారింది. రాంచీలో, హింసాత్మక నిరసనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పలు వాహనాలకు నిప్పుపెట్టారు. అనేక వాహనాలను ధ్వంసం చేశారు. మాజీ బీజేపీ నేతల వ్యాఖ్యలపై పలు ముస్లిం దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

English summary
Nupur Sharma, who made controversial remarks against Prophet, should be forgiven as per Islam: Jamaat Ulama-e-Hind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X