Nusrat Jahan: వివాహం అక్కడ..మిగతాది ఇక్కడ: అతనితో పెళ్లి చెల్లదు: నటి యువ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా: నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తన వైవాహిక బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిఖిల్ జైన్‌కు తను విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. నిఖిల్ జైన్‌తో తన వివాహం చట్టపరమైనది కాదని స్పష్టం చేశారు. విదేశీ గడ్డపై తన వివాహం జరిగిందని ఆ వివాహం భారత్‌లో చెల్లదని ఆమె అన్నారు. నుస్రత్ జహాన్ వివాహం టర్కీ వివాహ చట్టాల ప్రకారం టర్కీలో నిఖిల్ జైన్‌తో జరిగింది. భారతీయ వివాహ చట్టంలో ఈ వివాహం చెల్లుబాటు కాదు.

సహజీవనం లాంటిదే..

సహజీవనం లాంటిదే..

చట్ట ప్రకారం అది పెళ్లి కాదని, అదొక బంధం లేదా సహజీవనం మాత్రమే అని ఎంపీ నుస్రత్ జహాన్ చెప్పుకొచ్చారు.అలాంటప్పుడు విడాకులు అనే పదానికి చోటు లేదని చెప్పుకొచ్చారు. తాము ఇద్దరు వేరుపడి చాలాకాలం అయ్యిందని చెప్పుకొచ్చిన నుస్రత్ జహాన్... ఆ విషయాన్ని బహిర్గతం చేయదలుచుకోలేదని అది తన సొంత విషయం అయినందున ఇందులో ఎవరి జోక్యం అక్కర్లేదని భావించి తనలో తానే ఈ విషయాన్ని పెట్టుకున్నట్లు చెప్పారు. ఇక నిఖిల్ జైన్‌తో తన వివాహం చట్టపరమైనది కాదని తేల్చి చెప్పారు. చెల్లుబాటు కాదని వివరించారు. ఈ మేరకు నుస్రత్ ఒక ప్రకటన విడుదల చేశారు.

టర్కీలో నుస్రత్ వివాహం

టర్కీలో నుస్రత్ వివాహం

2019లో పశ్చిమబెంగాల్‌లోని బసీర్హత్ నియోజకవర్గం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు నుస్రత్ జహాన్. అదే 2019వ సంవత్సరంలో టర్కీలో ఆమె పారిశ్రామికవేత్త నిఖిల్ జైన్‌ను టర్కీలోని బోడ్రమ్‌లో వివాహం చేసుకున్నారు. ధనవంతుడు అని చెప్పుకునే నిఖిల్ జైన్ తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తీసుకునేవాడని నుస్రత్ ఆరోపించారు. ఇది ఇప్పటికే బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పిన నుస్రత్ త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తన బ్యాంకు అకౌంట్లతో పాటు తమ కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్ల వివరాలను కూడా నిఖిల్ జైన్‌కు ఇచ్చినట్లు చెప్పిన నుస్రత్ జహాన్..ఆ ఖాతాల లావాదేవీల గురించి తనకు కానీ తన కుటుంబ సభ్యులకు గానీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడని చెప్పారు.

నా కష్టాన్ని దోచుకునే ప్రయత్నం

నా కష్టాన్ని దోచుకునే ప్రయత్నం

ఇక తన బ్యాంకు ఖాతాల నుంచి తనకు తెలియకుండా ఎలా పడితే అలా లావాదేవీలు జరిపేవాడని నుస్రత్ మండిపడ్డారు.ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తాను తిరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇది నిజం అని చెప్పేందుకు తాను అన్ని రకాల రుజువులను లేదా సాక్ష్యాలను త్వరలోనే విడుదల చేస్తానని వెల్లడించారు. ఇక తన నగలు, ఆస్తులను కూడా నిఖిల్ జైన్ అక్రమంగా కొట్టేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు నుస్రత్ జహాన్. తాను జీవితంలో కష్టపడి పైకి వచ్చినట్లు చెప్పిన నుస్రత్ జహాన్ తన కష్టాన్ని మరొకరు ఆస్వాదించడం అన్యాయమని చెప్పారు.అలా జరగనివ్వనని చెప్పారు. ఇక తన వ్యక్తిగత విషయాలపై కొందరు అనవసరంగా తలదూరుస్తూ జోక్యం చేసుకుంటున్నారని వారందరు ఈ అంశాలకు దూరంగా ఉంటే వారికే మంచిదని హెచ్చరించారు నుస్రత్ జహాన్. ఇక మీడియా కూడా నిఖిల్ జైన్‌ను ప్రశ్నించడం మానుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+