శశికళకు షాక్! పన్నీరుకే 95శాతం మద్దతు: తేల్చేసిన ఆన్‌లైన్ సర్వే

సీఎంగా కొనసాగాలంటూ ఓ ఆన్‌లైన్‌ సర్వేలో 95శాతం మంది పన్నీర్‌సెల్వంకే మద్దతు తెలిపారు.

చెన్నై: తమిళనాడులో నెలకొన్న సంక్షోభం దేశ వ్యాప్తంగా ఆసక్తిని పెంచుతోంది. రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కాగా, ఈ క్రమంలో నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ సర్వేలో 95శాతం మంది పన్నీర్‌సెల్వంకే మద్దతు తెలపడం గమనార్హం. త‌మిళ‌నాడుకు నాయ‌క‌త్వం వహించేందుకు గౌర‌వ ముఖ్య‌మంత్రి త‌న ప‌ద‌విలో కొన‌సాగాలా? అన్న ప్రశ్నపై 95శాతం మంది నెటిజన్లు పన్నీర్‌కే తమ ఓటు వేశారు.

O Panneerselvam supporter puts out poll on Twitter asking if he should continue as CM

'సీఎంవో తమిళనాడు' పర్యవేక్షిస్తున్న ఓ పన్నీర్‌సెల్వం ట్విట్టర్‌ ఖాతా వేదికగా ఈ సర్వేను చేపట్టారు. సుమారు 52వేలమంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలిపారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తనను ముఖ్యమంత్రి పదవికి బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపిస్తూ పన్నీరు సెల్వం ఆమెపై తిరుగుబావుట ఎగురవేశాడు.

ఈ నేపథ్యంలో ఆయన ప్రజలు, యువత, సినీ తారల నుంచి అనూహ్య మద్దతు లభించింది. పార్టీ కీలక నేత మధుసూదన్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా పన్నీరుకే తమ మద్దతంటూ ఆయన వద్దకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం పన్నీరు, శశికళ ఇద్దరూ గవర్నర్‌ను కలిసి తమ బలాబలాలపై వివరించినట్లు తెలుస్తోంది. అయితే, గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+