
రేపు రాజస్తాన్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం.. పైలట్ సహా అతని టీమ్‌కు ఛాన్స్..?
రాజస్తాన్‌లో రాజకీయాలు క్రమంగా మారుతున్నాయి. ఆదివారం కొత్త మంత్రివర్గం కొలువు దీరనుంది. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ భవన్‌లో కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తారు. గోవింద్ సింగ్ డోస్తారా, రఘు శర్మ, హరీశ్ చౌదరీ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ కూడా రాశారు. దీంతో మంత్రివర్గం ఏర్పాటు ఖాయం అయిపోయింది. సచిన్ పైలట్ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అతని టీమ్ నుంచి మెజార్టీ పోర్టు పోలియోలు చేపట్టే ఛాన్స్ ఉంది.
రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్‌గా దోస్తారా కొనసాగుతున్నారు. ఒకరికి ఒకే పదవీ అనే కోణంలో.. తాను మంత్రి పదవీకి రాజీనామా చేశానని ఆయన వివరించారు. తాను కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతానని చెప్పారు. ప్రజలకు వ్యక్తిగతంగా పదవులు అందేలా చూస్తానని వివరించారు. గత ఏడాది నుంచి సచిన్ పైలట్.. గెహ్లట్ మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

సీఎం అశోక్ గెహ్లట్ తప్ప కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రివర్గంలోకి సచిన్ పైలట్.. ఆయన వర్గానికి చెందిన 12 మందికి అవకాశం దక్కనుంది. ఇదివరకు పైలట్ తిరుగుబాటు చేయడంతో.. అస్థిరత్వం నెలకొంది. కానీ రాహుల్ గాంధీ చొరవతో సమస్య సద్దుమణిగింది. లేదంటే సింధియా మాదిరిగా.. పైలట్ కూడా పార్టీ మారే అవకాశం ఉండేది. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. వసుంధర రాజే రూపంలో.. పైలట్‌కు అడ్డు తగిలారు. దీంతో ఆయనకు మార్గం సుగమం కాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా చర్చలు జరపడంతో పైలట్ సొంత గూటికి వచ్చారు.
ఇన్నాళ్లకు పైలట్ వర్గానికి ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు కూడా పైలట్ మంత్రిగా కొనసాగారు. పీసీసీ చీఫ్ పదవీ కూడా చేపట్టారు. కానీ గెహ్లట్‌తో గొడవ నేపథ్యంలో తిరుగుబాటు ఎగరవేశారు.
కొత్త మంత్రుల్లో హెమరామ్ చౌదరీ, బ్రిజేంద్ర ఒలా, మురారీ లాల్ మీనా, రాజేంద్ర గుడా పేర్లు వినిపిస్తున్నాయి. తన వర్గానికి బెర్తుల కోసం పైలట్ పట్టుబడుతున్నారు. పరిస్థితిని సమీక్షించడానికి అజయ్ మాకెన్ జైపూర్ చేరుకున్నారు.