భార్యను జీన్స్ వేసుకోనివ్వలేదు, వేధింపులు: విడాకులు
ముంబై: జీన్స్, కుర్తాలు ధరించవద్దని భార్యను ఓ భర్త బలవంతం చేయడంతో అదనపు కట్నం కోసం వేధించడంతో.. వారికి కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.
భార్యను జీన్స్, కుర్తాలు ధరించవద్దని, కేవలం చీరలు మాత్రమే కట్టుకోవాలని ఆమె భర్త వేధించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
తమకు 2010 డిసెంబర్‌లో పెళ్లయిందని, అప్పటి నుండి తనకు తన భర్త ఏ దుస్తులు కూడా కొనివ్వలేదని, తాను తన వేతనం నుండి జీన్స్, కుర్తాలు కొనుక్కున్నానని అయితే, వాటిని వేసుకోవద్దని, చీరలు మాత్రమే కట్టుకోవాలని భర్త బలవంతం చేస్తున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

విడాకులు
తన భర్త, అత్తామామలు.. జీన్స్, కుర్తాలు ధరించవద్దని చెప్పడంతో పాటు లక్ష రూపాయలను తన ఇంటి నుండి తీసుకు రావాలని డిమాండ్ చేశారని భార్య ఆరోపించారు.

విడాకులు
తన భర్త, అత్తామామలు.. జీన్స్, కుర్తాలు ధరించవద్దని చెప్పడంతో పాటు తనను ఉద్యోగం కూడా మానివేయాలని డిమాండ్ చేశారని భార్య ఆరోపించారు.

విడాకులు
తనను అత్తింటి వారు నిత్యం వేధింపులకు గురి చేశారని భార్య ఆరోపించారు. తాను అదనపు కట్నం తేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని ఆరోపించారు.

విడాకులు
కాగా, తాను అదనపు కట్నం తేనందుకు అత్తింటి వారి నుండి నెట్టివేయబడ్డానని, ఇప్పటి వరకు తాను తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నానని ఆమె మార్చి 15, 2011 నాడు కోర్టుకు చెప్పారు.

విడాకులు
తను పుట్టింటికి పంపిన తర్వాత తన భర్త ఒక్కసారి కూడా తనను తిరిగి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేయలేదని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు.

విడాకులు
తనను ఇంటికి తిరిగి తీసుకు వెళ్లక పోవడమే కాకుండా.. తనకు, తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా వల్గర్ సందేశాలు పంపించి వేధించేవాడని ఆమె ఆరోపించారు.

విడాకులు
వేధింపుల నేపథ్యంలో విడాకులు మంజూరు చేసిన న్యాయస్థానం... భర్త నుండి శాశ్వత భరణం ఇప్పించాలని కోరిన భార్య విజ్ఞప్తిని తిరస్కరించింది.












Click it and Unblock the Notifications