తొమ్మిదిమంది మంత్రుల రాజీనామా.. నిన్ననే అసెంబ్లీ స్పీకర్, త్వరలో మరొకరు

ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌ మంత్రివర్గంలో తొమ్మిది మంది మంత్రులు శనివారం ఉదయం రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్‌ నిరంజన్‌ పూజారి శుక్రవారమే రాజీనామా చేశారు.

భువనేశ్వర్‌: ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌ మంత్రివర్గంలో తొమ్మిది మంది మంత్రులు శనివారం ఉదయం రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలోనే వారు పదవుల నుంచి వైదొలగినట్లు సమాచారం.

రాజీనామాలు సమర్పించిన మంత్రుల్లో సంజయ్‌ దాస్‌బర్మా, అరుణ్‌ కుమార్‌ సాహు, పుష్పేంద్ర సింగ్‌దియో, ప్రణబ్‌ ప్రకాశ్‌ దాస్‌, సుదామ్‌ మరాండీ, ప్రదీప్‌ పాణిగ్రాహి, దేవీప్రసాద్‌ మిశ్రా, జోగేంద్ర బెహెరా, లాల్‌ బిహారీ హిమిరికా ఉన్నారు.

naveen-patnaik

అసెంబ్లీ స్పీకర్‌ నిరంజన్‌ పూజారి శుక్రవారమే రాజీనామా చేశారు. త్వరలోనే మంత్రి లాల్‌ బిహార్‌ హిమిరికా కూడా వైదొలగనున్నారని రాష్ట్ర మంత్రి జోగేంద్ర బెహెరా తెలిపారు. రేపు మంత్రివర్గ పునర్వ్వవస్థీకరణ నేపథ్యంలో మొత్తం పది మంది మంత్రులు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నామని, ఇందుకు సహకరించిన మంత్రులకు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+