సీఎంకు అస్వస్థత: స్వాతంత్ర్య దినోత్సవ వేదిక పైనే!, కుర్చీలో కాసేపలా..

గౌరవ వందనం స్వీకరించి.. ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

భువనేశ్వర్‌ : స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
వేడుకల్లో భాగంగా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. అంతకుముందు జెండా ఆవిష్కరించి జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.

అనంతరం గౌరవ వందనం స్వీకరించి.. ఆపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం అస్వస్థతకు గురవడంతో.. వెంటనే భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం సీఎం నివాసానికి తరలించగా.. అక్కడ ఇద్దరు వైద్యులు ఆయనకి చికిత్స అందించారు.

Odisha CM Naveen Patnaik falls sick during Independence Day celebrations

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సీఎం తన తదుపరి కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటారని, ఈరోజు షెడ్యూల్ రద్దు కాదని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

భువనేశ్వర్‌లో నిర్వహించిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో గౌరవం వందనం స్వీకరించిన తర్వాత
ఈ ఘటన చోటుచేసుకుంది. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు.

అనంతరం సీఎం నివాసానికి తరలించారు. అక్కడ ఇద్దరు వైద్యులు ఆయనకి చికిత్స అందించారు.
ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. నవీన్‌ పట్నాయక్‌... ఈరోజు షెడ్యూల్‌ ప్రకారం అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+