ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ పై నుంచి పడిపోయిన కానిస్టేబుల్.. తీవ్రగాయాలతో మృత్యువాత
ఐపీఎల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్.. చూస్తుంటే ఆ మజానే వేరు. బంతి బంతికి ఉత్కంఠ. నరాలు తెగేంత టెన్షన్. దానిని మించిన ఎంజాయ్ ఏముంటుంది. అయితే కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అలానే మంగళవారం కూడా ఓ దురదృష్టకర ఘటన జరిగింది. మ్యాచ్ చూస్తున్న ఓ కానిస్టేబుల్.. పై నుంచి పడిపోయాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
ఒడిశా రాయ్‌గడ్ జిల్లా చాందిలీలో దారుణం జరిగింది. నాబరంగ్‌పూర్‌కి చెందిన యోగేశ్వర్ దాస్ స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే మంగళవారం కూడా మ్యాచ్ చూస్తున్నాడు. మూడు అంతస్తుల పైన మొబైల్‌లో మ్యాచ్ వీక్షిస్తూన్నాడు. అయితే అలా నడుచుకుంటూ వచ్చాడెమో ఏమో కానీ.. పైనుంచి కింద పడిపోయాడు. ఇంకేముంది తీవ్రంగా గాయపడ్డారు.

బ్యాలెన్స్ కోల్పోవడంతోనే పడిపోయాడు. అతనిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలు కావడంతో చనిపోయారు. దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదా కోసం మ్యాచ్ చూస్తే ఇలా జరిగిందని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. వారి రోదన ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.
Recommended Video
2013లో ఓఎస్ఏపీ మూడో బెటాలియన్ కోరట్‌పుట్‌లో విధుల్లో చేరారు. తర్వాత బదిలీ అయి రాయగడ వచ్చారు. వచ్చిన ఐదు నెలల్లో మంచి పేరు సంపాదించారు. అయితే ఇంతలో ఇలా జరగడం విషాదం నెలకొంది. వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఇక తమకు దిక్కేవరు అని గుండెలవిసేలా రోదిస్తోంది. వారి రోదన ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.












Click it and Unblock the Notifications