మల్కన్‌గిరిలో ఎన్‌కౌంటర్: ఐదుగురు నక్సల్స్ మృతి
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరిలోని కలిమెడ ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులకు, మావోయిస్టు(నక్సల్స్)కు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతి చెందారు.
#Odisha: Five Naxals were killed in encounter between security forces and Naxals in Malkangiri's Kalimeda, early morning today.
— ANI (@ANI) November 5, 2018
మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మృదేహాలను మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నారన్న సమాచారంతో ఆదివారం నుంచి పోలీసులు కూంబింగ్ చేపట్టారు. కాగా, కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఓ డీడీ కెమెరామెన్‌ను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications