స్టేషన్‌లోకి దూసుకొచ్చిన గూడ్స్ రైలు: ముగ్గురు మృతి, బోగీల కింద పలువురు

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్ రైలు అ దుపుతప్పి ఫ్లాట్‌ఫాం మీదకు దూసుకొచ్చింది. దీంతో 10 బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు బోగీల కిందపడి మరణించారు.

ప్రయాణికులు నిరీక్షించే గది సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో రైలు బోగీల కింద మరికొంతమంది ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంతో రైల్వే స్టేషన్ కూడా దెబ్బతింది.

 Odisha: Goods train derails at Korai Railway Station; at least 3 killed

ఘటనా స్థలంలో సహాయక బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాయి. గాయపడిన పలువురిని సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైల్లు తాత్కాలికంగా రద్దయ్యాయి. మరోవైపు, ఈ ప్రమాదం కారణంగా రైల్వే స్టేషన్లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా కొంత భాగం కూలిపోయింది.

రైలు ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+