
కొడుకు పుట్టిన 18 ఏళ్లకు తెలిసిన భయంకర నిజం... అనుకోని పరిస్థితుల్లో ఆ విషయాన్ని బయటపెట్టిన భార్య...
కొడుకు పుట్టిన 18 ఏళ్ల తర్వాత ఆ తండ్రికి ఓ భయంకరమైన నిజం తెలిసింది. ఆ అబ్బాయి తనకు పుట్టినవాడు కాదని. తన భార్య వివాహేతర సంబంధం వల్ల అతను జన్మించాడని తెలిసింది. అనుకోని పరిస్థితుల్లో భార్య ద్వారానే ఈ నిజం బయటపడింది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... ఒడిశాకు చెందిన ఓ దంపతులకు 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొద్ది నెలలుగా అతను తరుచూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా,ఎన్ని టెస్టులు చేయించినా సమస్య ఏంటనేది తెలియలేదు. ఇదే క్రమంలో ఇటీవల ఢిల్లీలోని ఫోర్తీస్ ఆస్పత్రిలో కుమారుడికి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి వైద్యులు హై-పెర్మామెన్స్ లిక్విడ్ క్రోమోటోగ్రఫీ(HPLC) అనే టెస్టు ద్వారా ఆ యువకుడు సికెల్ సెల్ అనీమియా అనే సమస్యతో బాధపడుతున్నట్లు నిర్దారించారు. దీనికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.

సాధారణంగా సికెల్ అనిమీయా అనేది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు జన్యుపరంగా సంక్రమిస్తుంది. తల్లిదండ్రులిద్దరిలో ఆ లక్షణాలు మధ్యస్థంగా ఉంటే.. అది పిల్లలకు సంక్రమిస్తుంది. అయితే ఇద్దరిలో ఒకరికి ఆ లక్షణాలు లేకపోయినా పిల్లలకు అది సంక్రమించే అవకాశం లేదు. ఇదే విషయంపై ఫోర్తీస్ ఆస్పత్రి వైద్యుడు డా.రాహుల్ భార్గవ మాట్లాడుతూ...'తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ లక్షణాలు ఉండి... మరొకరు పూర్తి ఆరోగ్యవంతంగా ఉంటే ఈ సమస్య తలెత్తే అవకాశమే లేదు.' అని పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని యువకుడి తల్లిదండ్రులకు చెప్పారు. అయితే అతని తల్లికి మాత్రమే సికెల్ అనీమియా ఉందని,తండ్రికి లేదని తెలిసింది. ఎందుకైనా మంచిదని ఇద్దరికీ మరోసారి హెచ్‌పీసీఎల్ టెస్ట్ చేశారు. అందులోనూ అదే ఫలితం వచ్చింది. కేవలం తల్లికి మాత్రమే ఆ సమస్య ఉన్నట్లు తేలింది. ఇదే విషయాన్ని ఆ యువకుడికి చెప్పగా... అతను తన తండ్రికి చెప్పాడు. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆ సమస్య ఉంటే పిల్లలకు అది సంక్రమించే అవకాశం లేదని వైద్యులు చెప్పడం.... కానీ తమ విషయంలో అందుకు విరుద్ధంగా జరగడం అతనికి ఎక్కడో అనుమానం కలిగించింది. ఇదే విషయాన్ని భార్యతో చెప్పగా... ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది. 20 ఏళ్లుగా తనలోనే దాచుకున్న అసలు రహస్యాన్ని భర్తకు చెప్పింది.
అప్పట్లో పక్కింటి వ్యక్తితో తనకు వివాహేతర సంబంధం ఏర్పడిందని.... అతని వల్లే గర్భవతిని అయ్యానని బాంబు పేల్చింది. దీంతో ఆ వ్యక్తికి కూడా సికెల్ అనీమియా ఉండటం వల్లే ఆ యువకుడికి ఆ జబ్బు వచ్చి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భార్య తనను మోసం చేసిన విషయాన్ని బయటపెట్టడంతో అతను షాక్ తిన్నాడు.