Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్‌లో

ఒడిశా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి నాబ కిశోర్ దాస్‌పై ఎఎస్ఐ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన ఛాతీపై బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తపుమడుగులో కుప్పకూలిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

భువనేశ్వర్: ఒడిశాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నాబ కిశోర్ దాస్ పై అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన ఛాతీలో బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో ఈ ఘటన సంభవించింది. జిల్లాలోని బ్రజ్‌ రాజ్ నగర్ టౌన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మంత్రి నాబ కిశోర్ దాస్ హాజరు కావాల్సి ఉంది. ఇందులో పాల్గొనడానికి ఆయన ఈ ఉదయం రాజధాని భువనేశ్వర్ నుంచి హెలికాప్టర్ లో బ్రజ్ రాజ్ నగర్ కు చేరుకున్నారు. హెలి ప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు.

అక్కడ కారు నుంచి కిందికి దిగిన కొద్దిసేపటికే మంత్రి నాబదాస్ పై అసిస్టెంట్ సబ్ ఇన్ ‌స్పెక్టర్ గోపాల్ దాస్ కాల్పులు జరిపారు. నాలుగు నుంచి అయిదు రౌండ్ల మేర కాల్పులు జరిపాడు. అత్యంత సమీపం నుంచి బుల్లెట్ల వర్షాన్ని కురిపించాడు. మంత్రి ఛాతీలోకి నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే ఆయనను తొలుత ఝార్సుగూడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం- అక్కడి నుంచి భువనేశ్వర్ కు ఎయిర్ లిఫ్ట్ చేశారు.

Odisha Minister Naba Kishore Das was shot at by an ASI of police in Jharsuguda rushed to the hospital

భువనేశ్వర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తోన్నారు. మంత్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా- మంత్రిపై ఎఎస్ఐ గోపాల్ దాస్ కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు ఒడిశా పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ప్రస్తుతం గోపాల్ దాస్ తమ అదుపులో ఉన్నారని బ్రజ్ రాజ్ నగర్ ఎస్డీపీఓ గుప్తేశ్వర్ భోయ్ తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేశామని అన్నారు.

ఎవరి ఆదేశాల మేరకు మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు జరిపారనేది ఆరా తీస్తోన్నామని, మంత్రిపై వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తోన్నామని గుప్తేశ్వర్ చెప్పారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అధికార బిజూ జనతాదళ్ నాయకులు, కార్యకర్తలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీనితో బ్రజ్ రాజ్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను ప్రీ ప్లాన్డ్ గా ఆరోపిస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+