తాగు నీరు అడిగితే.. మూత్రం బాటిల్ ఇచ్చాడు.. ఎక్కడంటే..?
ఒడిశాలోని గణపతి జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఉన్నతాధికారికి తాగునీటి బదులు మూత్రం బాటిల్ ఇచ్చాడు ఆ కార్యాలయంలో పనిచేసే ప్యూన్. అది తాగిన ఉద్యోగి తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు. ఆ ప్యూన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఒడిశాలోని గ్రామీణ నీటి సరఫారా, పారిశుధ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సచిన్ గౌడకు నిందితుడైన ఫ్యూన్ సిబా నారాయణ్ నాయక్ మూత్ర బాటిల్ ఇచ్చాడు. జూలై 23న ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
జులై 23న రాత్రి అధికారి సచిన్ గౌడ.. ప్యూన్ సిబా నారాయణ్ నాయక్ ను మంచి నీరు అడిగారు. అయితే, నీటికి బదులుగా అతను మూత్రం ఉన్న బాటిల్ ఇచ్చాడు. రాత్రి సమయం కావడం, తక్కువ వెలుగు ఉండటంతో సచిన్ గౌడ ఆ బాటిల్ ను గుర్తించకుండా తాగాడు. అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు. చికిత్స కోసం బెర్హంపూర్ లోని మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు.

అయితే అధికారి చెప్పిన విషయాల ప్రకారం.. బాటిల్ లో ఉన్న ద్రవాన్ని టెస్ట్ చేశారు. అందులో అమ్మోనియా సాంద్రత సాధారణం కన్నా ఎక్కువగా ఉందని.. ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమని వెల్లడైంది. అయితే తనతో పాటు మరో ఇద్దరు అధికారులు కూడా ఇదే నీటిని తాగారని, దాని రుచి, నాణ్యత గురించి ఇలాంటి ఆందోళనలే వ్యక్తం చేశారని గౌడ.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడి నాయక్ పై కేసు నమోదు చేశారు. ఈ పని చేయడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications