రైలు ప్రమాద కారణాలపై వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి కీలక వ్యాఖ్యలు..!!
ఒడిశా రైలు ప్రమాదం పైన వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి కీలక వ్యాఖ్యలు చేసారు. ఒడిశా రైలు ప్రమాదానికి కారణాల పైన విశ్లేషించారు. ఇప్పటికే ఈ ప్రమాదానికి కారణాల పైన రైల్వే నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. కవచ్ వ్యవస్థ ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఈ నివేదిక..ప్రమాదం పైన స్పందించిన సుధాన్షు మణి కవచ్ ఉన్నా కాపాడేది కాదన్నారు.
ప్రమాదంపై ప్రాధమిక నివేదిక: ఒడిశా రైలు ప్రమాదం అందరినీ కలిచి వేసింది. దాదాపు 300 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మంది వరకు క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదం పైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందేహాలు వ్యక్తం చేసారు. యాంటీ కొలిజిన్ వ్యవస్థ ఉంటే ఈ స్థాయి ప్రమాదం జరిగేది కాదని వ్యాఖ్యానించారు.

రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రమాదం పైన నివేదిక ఇవ్వనుంది. ఇదే సమయంలో రైల్వే శాఖ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్‌ను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడం వల్లే మొదట ప్రమాదం జరిగిందని తెలిపింది.
సిగ్నలింగ్ లోపమే కారణమా: మెయిన్ లైన్‌లో నుంచి వెళ్లాల్సిన కోరమండల్ లూప్ లైన్లోకి వెళ్లిందని అధికారులు పేర్కొన్నారు. మొదట కోరమండల్‌కు మెయిన్ లైన్లో వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చారు. కానీ కొద్దిసేపటికి ఇచ్చిన సిగ్నల్‌ను నిలిపివేశారని అధికారులు తెలిపారు. సిగ్నల్ నిలిపివేయడం వల్లే మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన కోరమండల్ లూప్ లైన్లోకి వెళ్లి గూడ్స్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిందని.. పట్టాల తప్పిన కోరమండల్‌ను యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టిందని వెల్లడించారు.
ఇప్పుడు ఈ కోణంలో విచారణ సాగుతోంది. అయితే, ఈ వాదనతో రైల్వే ఇంజనీర్.. వందేభారత్ రూపకర్త సుధాన్షు మణి విభేదించారు. కవచ్ ఉన్నా ఈ ప్రమాదాన్ని నివారించేది కాదేమోనని అభిప్రాయ పడ్డారు. ప్రాధమిక సమాచారాన్ని బట్టి చూస్తే ఇది సిగ్నలింగ్ వైఫల్యంగా కనిపించటం లేదన్నారు.
విభేదిస్తున్న సుధాన్షు మణి: తొలి రైలు పట్టాలు తప్పటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోందని కీలక వ్యాఖ్యలు చేసారు. మొదటి రైలు పట్టాలు ఎలా తప్పిందనే విషయం పైన ప్రభుత్వం దర్యాప్తు చేయాలని సూచించారు. ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. దీంతో పాటుగా అతివేగంతో వెళ్తున్నందున కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పైలట్ బ్రేకులు వేయలేకోయారని సుధాన్షు మణి అభిప్రాయపడ్డారు.
ఈ ప్రమాదం పైన ఇప్పటికే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తన్నాయి. ఇప్పుడు రాజకీయాలు కాదని..ముందు సహాయక చర్యలు ముఖ్యమని మంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడు సుధాన్షు మణి వ్యక్తం చేసిన అభిప్రాయాలు కీలక చర్చకు కారణమవుతున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications