Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రాక్ పునరుద్దరణ, 51 గంటల్లోనే పూర్తి - అక్కడే రైల్వే మంత్రి మకాం..!!

ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. 275 మంది మరణించినట్లు..1,175కి పైగా క్షతగాత్రులు అయినట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రమాదంలో బోగీలన్నీ తుక్కు తక్కు అయ్యాయి. సహాయక చర్యలను వేగంగా పూర్తి చేసిన అధికారులు వెంటనే పునరుద్దరణ చర్యలు ప్రారంభించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మకాం వేసారు. యుద్ద ప్రాతిపదిక న నిర్వహించిన పనులతో 51 గంటల్లో ట్రాక్ పునరుద్దరణ పూర్తయింది. తొలుత గూడ్స్‌ రైలు నడిచింది.

తొలి రైలు ప్రారంభం:ప్రమాదం జరిగిన బాలసోర్ ప్రాంతలో తిరిగి తొలి రైలు నడించింది. రాత్రి 10.40 గంటలకు తొలి గూడ్స్ రైలు రాకపోకలను మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ రైలు విశాఖ ఓడరేవు నుంచి రూక్కేలా ఉక్కు కర్మాగారానికి బొగ్గు తీసుకెళ్తోంది. డౌన్ లౌన్ పునరుద్దరణ పూర్తయిందని.. మరి కొన్ని రైళ్లను ప్రయోగాత్మకంగా పంపంచి రెండు రోజుల్లోనూ పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. మంత్రి వైష్ణవ్ అక్కడే ఉంటూ సహాయక చర్యలతో పాటుగా పునరుద్దరణ పనులను పర్యవేక్షిస్తున్నారు.దాదాపు 1500 మంది కార్మికులు..ఇంజనీర్లు..సాంకేతిక నిపుణులు 48 గంటలుగా నిర్విరామంగా క్షేత్ర స్థాయిలో పనులు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయం నుంచి సిబ్బందిని షిఫ్టుల వారీగా ఘటనా స్థలికి తరలిస్తున్నారు.

Odisha Train Accident: Track linking Up-line has been restored at Balasore accident site

బోగీలు తుక్కు తుక్కు:కోరమాండల్ ఎక్స్ ప్రెస్ తో పాటుగా బెంగళూరు - హౌరా ఎక్స్ ప్రెస్ బోగీలు ప్రమాదంలో తుక్కుగా మారాయి. మరమ్మత్తలు చేసినా తిరిగి వినియోగించే పరిస్థితులు లేవు. ఓ రైలు బోగీలు కింద ఉండగా, దాని చక్రాలు అడుగు భాగం రైలు పైన కనిపిస్తున్నాయి. ట్రాక్ ఉన్న స్తంభాలు నేలమట్టమయ్యాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం.. ప్రయాణీకులు వాటిల్లో చిక్కుకొని ఉండటంతో నిపుణులతో సహాయక చర్యలు జాగ్రత్తగా నిర్వహించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయం నుంచి స్థానికులు పూర్తి స్థాయిలో సహకరించారు. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించటంలో సహకారం అందించారు. ఇప్పటికీ దాదాపు 60 మంది క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.

రైల్వే మంత్రి అక్కడే మకాం:ఈ దుర్ఘటన ప్రమాదా..ఉద్దేశ పూర్వక చర్యనా అని తేల్చేందుకు విచారణ ప్రారంభమైంది. రైల్వే బోర్డు ఈ ఘటన పైన సీబీఐ విచారణ చేయించాలని సిఫార్సు చేసింది. ప్రమాదంలో లోకో పైలెట్ తప్పు లేదని ఉన్నతాధికారులు తేల్చారు. ముందుగా సిగ్నల్ ఇవ్వటం..ఆ తరువాత రద్దు చేయటంతోనే మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన రైలు లూప్ లైన్ లోకి వెళ్లిందని గుర్తించారు. రైలు పట్టాలు మారుతూ వెళ్లటంలో కీలకమైన ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో లేవనెత్తిన గందరగోళం ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. పాయింట్ మెషిన్ సెట్టింగ్ ను మార్చినట్లు గుర్తించారు. ఈ క్రిమినల్ చర్యను ఎందుకు, ఎలా చేసారనేది తేల్చే పనిలో విచారణ అధికారులు ఉన్నారు. కవచ్ వ్యవస్థకు..ఈ ఘటనకు సంబంధం లేదని అధికారులు తేచ్చి చెప్పారు. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ లైన్ లో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+