కేసును ఉపసంహరించుకున్న ఆప్ ఎమ్మెల్యేలు: ఎందుకు?

హైదరాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అనర్హత వేటు పడిన ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు ఉపసంహరించుకున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు.

లాభదాయక పదవుల్లో ఉన్నారనే కారణంతో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలకు రాష్ట్రపతి ఆదివారంనాడు ఆమోద ముద్ర వేశారు.

Office of Profit case: Disqualified AAP MLAs withdraw plea

ఈసి ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆరుగురు శాసనసభ్యులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు సోమవారంనాడు తేల్చి చెప్పింది.

అనర్హతపై రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో దరఖాస్తుల వల్ల ఫలితం లేదని ఓ ఆప్ ఎమ్మెల్యే తరఫున వాదిస్తున్న న్యాయవాది చెప్పారు. అందుకే పిటిషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్ల వల్ల ఫలితం లేదని భావించి, వాటిని ఉపసంహరించుకున్నారు. తాజాగా వేరే పిటిషన్లను దాఖలు చేయాలని వారు భావిస్తన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+