కత్తులతో పొడిచి మామాకోడళ్లను చంపేశారు
న్యూఢిల్లీ: మామ కోడలిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన సెంట్రల్ ఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలోని తూర్పు పటేల్ నగరలో నివాసం ఉంటున్న సేవారాం కటారియా (90), ఆయన కోడలు శశి (64) హత్యకు గురైనారు. హత్య చేసిన నిందితులు చాకచక్యంగా తప్పించుకున్నారు.
సేవారాం కటారియా సీపీడబ్లూడీ లో ఇంజనీరుగా పని చేసి రిటైడ్ అయ్యారు. ఈయన కుమారుడు సుధీర్, కోడలు శశితో కలిసి తూర్పు పటేల్ నగరలోని ఒక ఇంటి మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నారు. సుధీర్, శశి దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
సుధీర్ కుమారుడు అమిత్ ఆస్ట్రేలియాలో చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. కుమార్తె ఢిల్లీలోనే వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నది. సుధీర్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సుధీర్ పని మీద బయటకు వెళ్లారు.

తరువాత 2.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. తరువాత ఎన్నిసార్లు కాలింగ్ బెల్ వేసినా ఇంటిలో నుండి ఎలాంటి స్పందన లేదు. తరువాత శశి మొబైల్ కు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. సుధీర్ కు అనుమానం రావడంతో కుమార్తె ఇంటికి వెళ్లి ఇంకో తాళం తీసుకుని వచ్చాడు.
ఇంటి తలుపులు తీసి చూడగా గుమ్మం సమీపంలో సేవారాం కటారియా శవమై కనిపించారు. బెడ్ రూంలో శశి శవమై కనిపించారు. ఇద్దరిని గొంతులు కేసి కత్తులతో పోడిచి దారుణంగా హత్య చేసిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. శశి శరీరం మీద ఉన్న బంగారు నగలు, ఇంటిలోని విలువైన వస్తువుల అలాగే ఉన్నాయి. ముగ్గురు, నలుగురు కలిసి టీ తాగి టేబుల్ మీద పెట్టి ఉన్న విషయం గుర్తించారు.
తెలిసిన వారే ఇంటిలోకి వచ్చి టీ తాగిన తరువాత చాకచక్యంగా మామను, కోడలిని దారుణంగా హత్య చేశారని పోలీసులు చెప్పారు. ఇంటిలో రక్తపు మరకలు ఉన్న ఒక కత్తెర, ఒక కత్తిని స్వాదీనం చేసుకున్నారు. హత్య చేసి ముందు డోర్ లోపల గడియ పెట్టి వెనుక డోర్ నుండి పారిపోయారని డీసీపీ పరమాదిత్య తెలిపారు.












Click it and Unblock the Notifications