Jammu and Kashmir:రాష్ట్ర హోదా ఇస్తేనే..లేదంటే: ఒమర్ అబ్దుల్లా వార్నింగ్
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో తెరపైకి ఆర్టికల్ 370 రద్దు మళ్లీ వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు చేసి మోదీ సర్కార్ చాలా పెద్ద తప్పు చేసిందని కాంగ్రెస్ కూటమి ఆరోపిస్తుండగా... అలా చేయడాన్ని ఎన్డీయే కూటమి సమర్థిస్తోంది. మొత్తానికి జమ్ము కాశ్మీర్‌లో ఎన్నికల హీట్ రోజురోజుకీ దగ్గరపడుతోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రయోగిస్తోంది కాంగ్రెస్ కూటమి. ప్రధానంగా అక్కడి స్థానిక పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్. జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా. లేనిపక్షంలో తాము సుప్రీంకోర్టు తలపులు తడుతామని హెచ్చరించారు.పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వకుంటే ఇక్కడ ఎన్నికైన ముఖ్యమంత్రికి పూర్తిస్థాయిలో అధికారం లేదా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండదు. అయితే ఇది కేవలం తాత్కాలికమే అని జమ్మూ కాశ్మీర్‌కు తప్పకుండా రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా
పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు జమ్మూ కాశ్మీర్ అంతకుముందు ఎలా ఉందో అలానే తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఒమర్ అబ్దుల్లా గుర్తుచేశారు. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టును కూడా హామీ ఉందని అన్నారు.అందుకే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి పూర్తిస్థాయిలో చట్టాలు, నిర్ణయాలు చేసే అధికారం, హక్కు, స్వేచ్ఛ ఉండాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటే చాలా సమయం పడుతుంది కానీ జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా అనేది ఇక్కడి అసెంబ్లీలో తీర్మానంతో జరిగిపోతుందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. 2019 నుంచి ఇప్పటి వరకు బీజేపీ నాయకులు ఒకే పాట పాడుతున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఢిల్లీలో కూర్చుని ప్రపంచానికి చాటింపు వేస్తున్నారని అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు.
కాంగ్రెస్‌తో పొత్తు పై..
కాంగ్రెస్‌తో జట్టు కట్టడంపై స్పందించారు ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ పై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల అభిప్రాయం ఒక్కటిగా ఉన్నందున పొత్తుతో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అబ్దుల్లా చెప్పారు. తమకు బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.ఇకపై అలాంటి వార్తలు పుట్టుకొచ్చిన నమ్మాల్సిన పని లేదని చెప్పిన ఒమర్ అబ్దుల్లా.. కొన్ని ప్రాంతాల్లో ఓట్లు కూడా చీలకుండా ఉండాలంటే పొత్తు ఎంతో అవసరమని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications