మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల టెన్షన్: క్రిస్మస్, న్యూ ఇయర్ ముందు బీఎంసీ తాజా మార్గదర్శకాలు
మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శనివారం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రద్దీని నివారించాలని సాధారణ ప్రజలను కోరింది. అయితే, కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరించింది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ మొత్తం 48 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇది ఇప్పటి వరకు దేశంలోనే అత్యధికం కావడంతో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తమైంది.

కరోనా నిబంధనలను ఉల్లఘించే వారిపై చర్యలకు వార్డు స్థాయిలో స్క్వాడ్ లు
బీఎంసీ సవరించిన గైడ్‌లైన్‌లో కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వార్డు స్థాయిలో స్క్వాడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వివాహాలు మరియు ఇతర వేడుకల సమయంలో మార్గదర్శకాలను పాటించడం అందరికీ తప్పనిసరి అని పేర్కొంది. మరిన్ని వివరాలను తెలియజేస్తూ, ముంబై సివిక్ చీఫ్ ఐఎస్ చాహల్ మెట్రోపాలిస్‌లోని ప్రజలు తప్పనిసరిగా హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాస్, మాల్స్‌లో రద్దీని నివారించాలని, పెద్ద సంఖ్యలో జనాలతో గుమికూడకుండా జాగ్రత్తలు వహించాలని వివాహాలు మరియు ఇతర కార్యక్రమాలకు హాజరు పరిమితులను ఖచ్చితంగా పాటించాలని నొక్కి చెప్పారు.

ఆరోగ్య వ్యవస్థపై ఒమిక్రాన్ ఒత్తిడి.. అప్రమత్తత అవసరం
కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోందని, ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తెస్తోందని, మూడవ వేవ్‌ను నిరోధించాలని ప్రభుత్వం మరియు పరిపాలన పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ, మార్గదర్శకాలను చాలాచోట్ల సరిగ్గా పాటించడం లేదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ చెప్పారు. పౌరుల సహకారంతో పాటు టీకా డ్రైవ్ యొక్క అద్భుతమైన నిర్వహణ, వేగంగా వ్యాక్సినేషన్ కారణంగా మహానగరంలో వ్యాప్తి పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని ఆయన అన్నారు.

ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో సవరించిన నిబంధనలు
ఇక సవరించిన తాజా నిబంధనల ప్రకారం చూస్తే 1,000 మంది కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడాలంటే స్థానిక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ముందస్తు అనుమతి అవసరం అని పేర్కొన్నారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కచ్చితంగా పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని పేర్కొన్నారు. హోటళ్లు రెస్టారెంట్లు షాపింగ్ మాల్ లలో వాటి సామర్థ్యం లో 50 శాతం మాత్రమే జనాలను అనుమతించాలని పేర్కొన్నారు. ప్రముఖుల పర్యటనలను నిలుపుదల చేయాలని ఎక్కువ సంఖ్యలో జనాలు గుమికూడితే సమస్య ఉత్పన్నమవుతుందని పేర్కొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు .. ఇప్పటికే 48 కేసులకు చేరిన మహారాష్ట్ర
నవంబర్ 27న మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అలాగే ముంబై పోలీసు నోటిఫికేషన్‌లను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ మరియు అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇదిలా ఉంటే మహారాష్ట్రలో శుక్రవారం 8 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 48కి చేరుకుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండి వచ్చిన నవీకరణల ప్రకారం, మొత్తం తాజా ఎనిమిది కేసులలో, ఆరుగురు రోగులు పూణే నుండి వచ్చారు. ఒకరు ముంబై నుండి కాగా మరొకరు కళ్యాణ్-డోంబివిలి నుండి వచ్చారు. మొత్తం ఎనిమిది కొత్త ఒమిక్రాన్ రోగులు పురుషులు. వీరంతా 29 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని సమాచారం.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications