వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం - మహారాష్ట్రలో నమోదు : వేగంగా పెరుగుతున్న కేసులు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

విదేశాల్లో బెంబేలెత్తిస్తున్న ఒమిక్రాన్ ఇప్పుడు భారత్ లోనూ వేగంగా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా 28 రోజుల్లోనే 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1200 దాటింది. అత్యధికంగా మహరాష్ట్రలో కేసులను గుర్తించారు. ఒక్క మహారాష్ట్రలోనే 450 కేసులు నిర్దారణ అయ్యాయి. ఇక, శుక్రవారం దేశ వ్యాప్తంగా 198 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా గుర్తించారు. ఇక, తాజాగా అందుతున్న సమాచారం మేరకు మహారాష్ట్రలో ఒమిక్రాన్ నిర్దారణ అయిన వ్యక్తి మరణం ద్వారా దేశంలో ఒమిక్రాన్ తొలి మరణం నమోదైంది.

తొలి ఒమిక్రాన్ మరణంగా

తొలి ఒమిక్రాన్ మరణంగా


52 ఏళ్ల ఒమిక్రాన్ సోకిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల మేరకు ఆ వ్యక్తి డిసెంబర్ 28న మరణించాడు. నైజీరియా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి పింప్రీ చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని యశ్వంత్ చవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతను 13 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నారని చెబుతున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కాని కారణాల వల్ల జరిగిన మరణంగా పరిగణించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపిన నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలో అతనికి ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్ సోకిందని తేలడం యాదృచ్ఛికమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ వెల్లడించింది.

వేగంగా పెరుగుతున్న కేసులు

వేగంగా పెరుగుతున్న కేసులు

డిసెంబర్ 2న కర్ణాటక రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు దేశంలో తొలి కేసులు బెంగుళూరులోనే నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 1200 దాటినట్లు తెలుస్తోంది. వారం రోజుల సమయంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య అయిదు రెట్లు వేగంగా పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే కేసుల సంఖ్య తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటివరకు దేశంలో 395 ఒమిక్రాన్ బారి నుంచి కోలుకున్నారు. అదే సమయంలో, క్రియాశీల రోగుల సంఖ్య 810గా ఉంది. దేశంలో 263 ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 57 మంది కోలుకున్నారు. 206 మంది ఇంకా చికిత్సలో ఉన్నారు.

Recommended Video

Eta Variant In India ఇప్పటికే పలు వేరియంట్లు | Kerala | COVID 19 Vaccination || Oneindia Telugu
ఆంక్షల అమలుతోనే నియంత్రణ

ఆంక్షల అమలుతోనే నియంత్రణ

తరువాతి స్థానంలో గుజరాత్ ఉంది. అక్కడ 97 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. వారిలో 44 మంది కోలుకున్నారు. 53 మంది ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో, రాజస్థాన్ (69), కేరళ (65) కేసులతో వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నాయి. అయితే, అధికారిక లెక్కల ప్రకారం జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఇంతవరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు. ఇక, ప్రపంచ వ్యాప్తంగా 3.30 లక్షల మంది ఓమిక్రాన్ బారిన పడినట్లుగా నిర్దారణ అయింది. నవంబర్ 25న ఈ వేరియంట్ ను తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించారు. అంచనాల కంటే వేగంగా వైరస్ అనేక దేశాల్లో వ్యాప్తి చెందుతోంది.

English summary
Omicron first death has been reported in Mahrastra, 52 years old man from Nigeria tested omicron positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X